మెట్రోలో బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ప్రయాణం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన, బాధ్యతాయుత వనరుల వినియోగ పిలుపునకు అనుగుణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు జూబ్లీహిల్స్‌లోని కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెట్రోలో ప్రయాణించారు. తార్నాక మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ఎక్కారు. ప్రజా బాధ్యత, క్రమశిక్షణతో కూడిన నాయకత్వానికి ఆయన ఆదర్శంగా నిలిచారు. కారులో ప్రయాణించకుండా ప్రజా రవాణాను ఎంచుకోవడం ద్వారా ఇంధన పొదుపు, ఆర్థిక ఆదా, స్థిరమైన రవాణా పట్ల తన దృఢ నిబద్ధతను ఆయన చాటిచెప్పారు. అనవసర ఇంధన వినియోగాన్ని తగ్గించడం, బాధ్యతాయుతమైన పద్ధతులను అవలంబించేందుకు దేశ ప్రజలకు గౌరవ ప్రధానమంత్రి పలు సూచనలు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *