– ఖేలో ఇండియా గేమ్స్‌ను విజయవంతం చేయండి
– గేమ్స్ నిర్వహణపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. డిసెంబర్ 11 నుండి 22వ తేదీ వరకు జరిగే ఖేలో ఇండియా యువజన క్రీడల ఏర్పాట్లపై సచివాలయంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ హైదరాబాద్‌తోపాటు హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 18 ఏళ్ల లోపు వయస్సు ఉన్న క్రీడాకారులు పాల్గొనే ఈ క్రీడా పోటీలు దేశంలో జాతీయ క్రీడల అనంతరం అంతే ప్రాధాన్యత ఉన్న పోటీలని, మొత్తం 27 ఈవెంట్స్‌లో దాదాపు 6,050 మంది క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. వీటిలో 14 వ్యక్తిగత క్రీడా విభాగాలు, 6 విభాగాలు టీమ్ ఈవెంట్లు, మరో ఆరు ఇతర క్రీడా ఈవెంట్లు ఉంటాయన్నారు. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా, క్రీడా శాఖ మంత్రి కో-చైర్మన్‌గా మొత్తం 18 మందితోకూడిన ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. దీంతోపాటు 28 మంది ఉన్నతాధికారులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, మరో 18 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని సంజయ్ జాజు వెల్లడించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, స్పోర్ట్స్ కార్పొరేషన్ ఎండీ సోని బాలాదేవి, కళాశాల, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఐటి శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, రైతు డిస్కమ్ ఎండీ ముషారఫ్ అలీ, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





