– అనురాగ్ సొసైటీ చైర్‌పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి
హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : స్వయం ఉపాధి శిక్షణలు మహిళల ఆర్థికాభివృద్ధికి, వారి స్వయం సమృద్ధికి ఎంతగానో దోహదపడతాయని కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు, అనురాగ్ సొసైటీ చైర్‌పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. ఎఫఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల అభివృద్ధి సమితి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు యమడాల హనుకాంత్ అధ్యక్షతన హన్మకొండ జిల్లా కొండపర్తి గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకT శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే కొత్తగా 40మంది పేద మహిళలకు కుట్టు శిక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ స్వయం ఉపాధి శిక్షణలను మహిళలు వినియోగించుకుని తమ కాళ్ళపై తాము నిలబడాలని కోరారు. మహిళల ప్రగతితోనే దేశాభివృద్ధి దాగి ఉందని, ఒక మహిళ ఆర్ధికంగా ఎదిగితే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
చక్కని నైపుణ్యం పొందిన వారికి ప్రభుత్వం అనేక రకాల రుణ సదుపాయాలు కల్పిస్తోందని, మహిళా గ్రూపుల సహకారంతో సొంతంగా వ్యాపారం మొదలుపెట్టుకుని ఉన్నతంగా ఎదగవచ్చని ఆమె సూచించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యÖనిట్ సీఐ రమేష్ మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళల భద్రత విషయంలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎఫఎంఎం సంస్థ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎర్ర శ్రీకాంత్, ప్రాజెక్టు మేనేజర్ దీపకరుణ, అజయ్, హనుకాంత్, వార్డ్ మెంuర్స్ కట్కూరి, స్వాతి, కట్ట, సంబరాజు, మాజీ సర్పంచ్, కట్కూరి, రాజమణి పాల్గొన్నారు





