ఆయుష్ ఎకో-సిస్టమ్ బలోపేతంపై 8న వర్క్ షాప్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆయుష్ ఎకో- సిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనంలో నీతి ఆయోగ్ ఈనెల 8వ తేదీన జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తుందని రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ ఐషా మస్రత్ ఖానం వెల్లడించారు. ఈ జాతీయ వర్క్ షాప్‌నకు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరవుతారని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్ కోతేచ, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తులు కూడా హాజరవుతారన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *