– ఎమ్మెల్సీ తాతా మధుపై మంత్రి పొంగులేటి ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పదవి ఏ ఒక్క పార్టీకి, వ్యక్తికి సంబంధించినది కాదని.. అది శాసనసభ గౌరవానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. స్పీకర్‌ను అవమానించడం అంటే శాసనసభను, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలు సహజమే అయినా వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు ప్రజాప్రతినిధులు దూరంగా ఉండాలని సూచించారు. మధు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. స్పీకర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తాత మధుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




