రైతుల కోసం జీవితాన్ని ధారపోశారు

– సారంపల్లి మరణం రైతాంగానికి తీరని లోటు
– ఆయన సంస్మరణ సభలో సీఎం రేవంత్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : సమస్యలపై అవగాహన, సంస్కారవంతంగా అంశాలను లేవనెత్తడంలో రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డికి సాటి లేరని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కౌలు రైతుల సమస్య, పంటలకT గిట్టుబాటు ధర కోసం ఆయన ఎంతో పోరాడారన్నారు. భూమి సారం నుంచి పంట తీసేవరకు సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్‌సైక్లోపీడియా సారంపల్లి.. ఆయన రాసిన పుస్తకాలు, లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతాంగ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. రవీంద్రభారతిలో సోమవారం జరిగిన సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో ఆయన ప్రసంగించారు. తొలుత ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సారంపల్లి అంటే వ్యక్తిగతంగా తనకు ఎంతో అభిమానం అని, భూమి లేని నిరుపేదలకు కనీస కూలి ఉండాలని కమ్యూనిస్టులు కొట్లాడితే కనీస వేతన చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. దున్నేవాడికి భూమి కోసం కమ్యూనిస్టులు పోరాడారంటూ అసైన్డ్ భూములను 24 లక్షల 56 వేల ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పంచిందని, పది లక్షల ఎకరాలు ఆదివాసీల చేతుల్లో ఉన్నాయని తెలిపారు. ఇది కమ్యూస్టుల పోరాటానికి .. కాంగ్రెస్ పరిష్కారం చూపి ఉపాధి హామీ చట్టం ద్వారా పని కల్పించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చిందని, కమ్యూనిస్టులు లేవనెత్తిన ప్రతీ సమస్యను కాంగ్రెస్ పరిష్కరించిందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో కలిసినా కలవకపోయినా కమ్యూనిస్టుల పోరాటం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడిందన్నారు. అందరం కలసి దేశంలో మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడు కొత్తకొత్త విధానాలను అవలంబిస్తున్నారని, ‘సర’ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను టార్గెట్ చేసుకున్నారని, తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని, బెంగాల్‌లో చేసినట్లే తెలంగాణలో చేస్తామని బీజేపీ నాయకులు బరితెగించి మాట్ల్లాడుతున్నారని అన్నారు. గత ఎన్నికల్లో బూత్‌ల వారీగా ప్రైవేటు ఏజెన్సీలను పెట్టి సర్వేలు చేయించి క్రమపద్ధతిలో బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగిస్తున్నారని, ఎన్నికల కమిషన్‌ను కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. ‘సర’పై ప్రధాన ప్రతిపక్షం ఒక్క మాట మాట్లాడటంలేదని, దీని వెనక వారికున్న అవగాహనను కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికలు వేరు.. పేదల ప్రాథమిక హక్కులు వేరు అన్నారు. ఎర్ర జెండా కనిపిస్తే పేదవాడికి ఒక భరోసా అని పేర్కొన్నారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్రమోదీ మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు అని అన్నారు. పేదల ఓటు హక్కును కమ్యూనిస్టులు కాపాడాలి అని పిలుపునిచ్చారు. కేబినెట్ సహచరులతో చర్చించి సారంపల్లి మల్లారెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తాం అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *