అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి

– మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: మైనారిటీల సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ గారు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో మైనారిటీల సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ సంస్థల చైర్మన్లు, శాఖాధిపతులతో మంత్రి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తగిన గుర్తింపు, ప్రచారం లభించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తమ పరిధిలోని సమస్యలను జాబితా రూపొందించుకుని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలని ఆదేశించారు. తన వద్దకు వచ్చే ఫైళ్లను వెంటనే పరిశీలించి ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరిస్తున్నానని అజహరుద్దీన్ తెలిపారు. అదేవిధంగా అధికారులు కూడా తమ పనుల్లో వేగం పెంచాలని, ‘సంక్షేమం’ అనే పదానికి నిజమైన అర్థం వచ్చేలా పనిచేయాలని సూచించారు. సమావేశంలో వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడమీ, షాహీ మసీదు, టీజీఎంఆరఈఐఎస్, ఖాజీలకు సంబంధించిన అంశాలతోపాటు శాఖ పరిధిలోని ఇతర సంస్థలకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. టీజీఎంఆరఈఐఎస్ అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాలు విమర్శించేందుకు ఎలాంటి అవకాశం లేకుండా అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పనితీరును వివరించే సమాచారంతో వక్ఫ్ బోర్డు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.సమావేశానికి ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, మైనారిటీల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, కార్యదర్శి బి.షఫీఉల్లా, హజ్ కమిటీ చైర్మన్ గులాం అఫ్జల్ బియాబానీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కోత్వాల్, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ తదితర అధికారులు హాజరయ్యారు. మైనారిటీ సంక్షేమ సంస్థల చైర్మన్లు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వానికి విమర్శలకు తావులేకుండా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *