మ‌హిళ‌లు అన్ని రంగాల్లో ఎద‌గాలి

  • రాష్ట్రంలోని మహిళల ఆర్థిక ప‌రిపుష్టికి ప్రోత్సాహం
  • వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
  • మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తొలి పెట్రోల్ పంపున‌కు శంకుస్థాప‌న‌

మహిళలు సంపూర్ణంగా అన్ని రంగాల్లో ఎదగాలని వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆకాంక్షించారు. స్వయం ఉపాధిని పెంచుకునే విధంగా మహిళలు ఆలోచించాలని సూచించారు. విద్యతో ధైర్యం, స్థైర్యం పెరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా మహిళలు ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. శుక్ర‌వారం సంగారెడ్డి పట్టణంలో పురపాలక శాఖ ఆధ్వ‌ర్యంలో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయాలనే సంకల్పంతో రూ.44 కోట్లతో అమృత్ జల పథకాన్ని మంత్రి దామోదర ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహిళలతో నిర్వహించే తొలి పెట్రోల్ పంపును  రూ.2కోట్ల తో ఇండియన్ ఆయిల్ పంపు ఏర్పాటు కు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర‌ రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంగారెడ్డి లో మహిళల ఆధ్వర్యంలో తొలి పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళలు చదువుకుంటే సమాజంలో మార్పు వొస్తుందన్నారు. సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తిని తీసుకుని ముందుకుపోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. 1993లో ఆందోల్ లో మహిళా సంఘాలకు 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. మహిళలు సంపూర్ణంగా అన్ని రంగాల్లో ఎదగాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆకాంక్షించారు. స్వయం ఉపాధిని పెంచుకునే విధంగా మహిళలు ఆలోచించాలని సూచించారు.

విద్యతో ధైర్యం, స్థైర్యం పెరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా మహిళలు ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. మహిళా సమాఖ్య సభ్యులు అనేక అభివృద్ధి పనులతో పాటు స్వయం ఉపాధి సాధించేలా తమ కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు . మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్యకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, ఫహీం, కలెక్టర్ క్రాంతి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *