Tag women empowerment

గ్లోబల్ వేదికలపై తెలుగు మహిళా తేజాలు!

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన శాండీ రెడ్డి ఆస్ట్రేలియాలోని సిడ్నీ (స్ట్రాత్‌ఫీల్డ్) మేయర్‌గా ఎన్నిక కావడం కేవలం ఒక వ్యక్తిగత విజయం కాదు; అది అంతర్జాతీయ వేదికపై తెలుగువారి ప్రాతినిధ్యానికి దక్కిన గౌరవం. వ్యాపార, సాంకేతిక రంగాలకే పరిమితం కాకుండా, విదేశీ రాజకీయాల్లోనూ తెలుగు మహిళలు తమ జెండాను పాతడం ఒక చారిత్రక పరిణామం. అమెరికా, బ్రిటన్,…

మహిళల్లో అక్షరాస్యత: లింగ వివక్షను అధిగమించే మార్గం

భారతదేశం విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యం ప్రాథమిక విద్య అందరికీ సమానంగా అందడంపైనే ఆధారపడి ఉంది. గత రెండు దశాబ్దాలుగా బడుల్లో చేరే పిల్లల సంఖ్య పెరిగినప్పటికీ, స్త్రీ, పురుషుల అక్షరాస్యత మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పటికీ సమాజంలో ఒక ప్రధాన సమస్యగా కొనసాగుతోంది. అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ఈ అంతరం స్పష్టంగా…

‘నారీ శక్తి’తో రాజకీయ చదరంగం..

  “మహిళా సాధికారత అనేది ఒక నినాదంగా కాకుండా కార్యరూపంలోకి రావాలంటే, ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్లలోనే రిజర్వేషన్లను అమలు చేయాలని మహిళా సంఘాలు . డిమాండ్ చేస్తున్నాయి. సీట్ల సంఖ్య పెంచడం వల్ల సమానత్వం రాదని, ప్రస్తుతం ఉన్న సీట్లలో మహిళలకు స్థానం కల్పించినప్పుడే అసలైన మార్పు వస్తుందని వారు వాదిస్తున్నారు. భారతదేశంలో మహిళా రిజర్వేషన్…

Women’s Reservation: మహిళా రిజర్వేషన్ భిక్ష కాదు.. హక్కు…!

women reservation

“ప్రభుత్వానికి మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై చిత్తశుద్ధి ఉంటే జనాభా గణన , నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. ప్రస్తుత నియోజకవర్గాల్లోనే రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్లు అమలుచేయొచ్చు. దీనికి జనగణన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే మహిళా వోటర్ల శాతమే ఎక్కువ కనిపిస్తుంది. అంటే రాష్ట్రాల్లో…

నారీ శక్తికి పట్టాభిషేకం! భారత పార్లమెంటులో చారిత్రక ప్రజాస్వామ్య విప్లవం

“2029 ఎన్నికలు భారత పార్లమెంటును ఒక సరికొత్త ‘నారీ శక్తి’ వేదికగా మార్చబోతున్నాయి. తెరపై కనిపించే గణాంకాల కంటే, విధాన నిర్ణయాల్లో మహిళలు పోషించబోయే క్రియాశీలక పాత్ర దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. సామాజిక సమస్యల పట్ల మహిళలకు ఉండే సహజమైన సున్నితత్వం, జవాబుదారీతనం చట్టసభల పనితీరును మరింత మెరుగుపరుస్తాయని ఆశించవచ్చు. రాజకీయ సంకల్పం, పారదర్శకమైన అమలు…

మహిళల అభివృద్ధికి మార్గం మహిళా రక్షణ చట్టాల అమలులో నిబద్ధతే

The Path to Women’s Development Lies in Strong Implementation of Protection Laws

భారతదేశంలో మహిళల రక్షణ చట్టాల సమర్థవంతమైన అమలుకు సంస్థాగత సామాజిక చర్యలు అవసరం. చట్టాల అమలును బలపరచడం ద్వారా మహిళలకు న్యాయం అందించవచ్చు. ఇందుకోసం మహిళలకు సంబంధించిన కేసులను సమర్థంగా నిర్వహించేందుకు పోలీసులకు లింగసున్నితమైన శిక్షణ ఇవ్వాలి. మహిళలపై జరిగే నేరాలపై త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రత్యేక కోర్టుల సంఖ్యను పెంచాలి. మహిళలు తమ హక్కులు అందుబాటులో ఉన్న న్యాయ మార్గాల గురించి తెలుసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తు చేస్తుంది. లింగ సమానత్వం,  మహిళల సాధికారత, విద్య, భద్రత, నాయకత్వం ఎంత ముఖ్యమో ఈ రోజు సమాజానికి గుర్తు చేస్తుంది. ప్రభుత్వాలు, సంస్థలు, సమాజాలు వివిధ రంగాల్లో మహిళల కృషిని గుర్తించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాయి. సమాజంలో మహిళలు ఎదుర్కొనే వివక్ష, హింస అడ్డంకులను తొలగించాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తుంది.. 2026 సంవత్సరానికి నేపథ్యం (థీమ్) “లాభం కోసం ఇవ్వండి” (Give to Gain).అంటే వ్యక్తులు,   సమాజాలు మహిళలకు మద్దతు, వనరులు,  అవకాశాలు అందించినప్పుడు అందరికీ లాభం కలుగుతుందని ఈ భావన.  ఈ థీమ్ ఉదారత, సహకారం,  లింగ సమానత్వం కోసం సమిష్టి బాధ్యతను ప్రోత్సహిస్తుంది. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కులను గౌరవిస్తూ సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తుంది.  మహిళల…

స్థానిక ప్రజాస్వామ్య పరీక్ష: మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల పాత్ర

కుర్చీల కేటాయింపుతో కదిలిన రాజకీయాలు పట్టణ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మరో నిర్ణాయక దశను దాటింది. ఓటరు జాబితా తుదిరూపు దాల్చిన తర్వాత తాజాగా మున్సిపల్ శాఖ రిజర్వేషన్లను పూర్తిగా ఖరారు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలో ఉన్న 131 పట్టణ స్థానిక…

స్త్రీ శక్తి లేకుండా 3 ట్రిలియన్‌ ఎకామనీ ఎలా సాధ్యం..? .

How Is a $3 Trillion Economy Possible Without Women’s Power?

“ఒక్క రాచకొండ పరిధిలోనే ఈ స్థాయిలో పెరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, మైనర్ల పరిస్థితి ఏంటీ..?.ఇందిరమ్మ రాజ్యంలో ఈ స్థాయిలో మహిళలపై మైనర్లపై నేరాలు పెరిగితే ఇందిరా గాంధీకే అవమానం కాదా..?. .అందులో మహిళలు, మైనర్లపై వేధింపులు, హత్యాలు, అత్యాచారయత్నం జరుగుతుంటే మహిళలకు , మైనర్లకు రక్షణ ఎక్కడ ఉంటుంది.. క్రైం సీటీకి కంపెనీలు ఎలా…

మహిళలను అభివృద్ధి,సాధికారత వైపు మళ్ళిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాలు

తెలంగాణ రాష్ట్రంలో మహిళల సామాజిక,ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక సంఘాలు ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలికాయి.మహిళా సాధికారతలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నది.స్వయం సహాయక సంఘాల లోని మహిళా శక్తి నేడు ఆర్థిక వ్యవహారాల్లో భాగస్వామ్యమై కుటుంబాన్ని, సమాజాన్ని ,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నవి. సెర్ప్, మెప్మా సంస్థల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది…