– అర్థవంతమైన మార్గంలో సాగితేనే మంచిది
– జెన్‌జిలకు మోదీ పరోక్ష హెచ్చరికలు
న్యూదిల్లీ, ఆగస్ట్ 12: ప్రధాని నరేంద్ర మోదీ జెన్‌జీ యువతకు కీలక సూచన చేశారు. షార్ట్‌కట్ కోసం వెంపర్లాడితే నష్టపోయే ప్రమాదమే ఎక్కువని ప్రధాని హెచ్చరించారు. జీవితంలో ముందుకుసాగే క్రమంలో అర్థవంతమైన మార్గాలను ఎంచుకోవాలని హితవు పలికారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. కొందరు వ్యక్తులు వేగంగా గమ్యాన్ని చేరుకునేందుకు ఫుట్‌బ్రిడ్జ్‌లను వాడకుండా రైల్వే ట్రాక్‌లను దాటుతుంటారని మోదీ గుర్తుచేశారు. అలాంటి వారికోసమే రైల్వే స్టేషన్లలో బోర్డులపై ప్రదర్శించే హెచ్చరికలు జీవిత పాఠాలను నేర్పుతాయన్నారు. మన ఆలోచనలపై ప్రభావం చూపించే ఇన్‌ఫ్లుయెన్సర్లు, రీల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ముందుకు వెళ్లే మార్గం కావాలనుకుంటే.. మీరు ఆరాధించే వ్యక్తుల ఆత్మకథ చదవండని సూచించారు. ఇటీవల కాలంలో మోదీ జెన్‌జీ యువతతో కనెక్ట్ అయ్యేలా తన సోషల్ డియా యాక్టివిటీలో మార్పులు చేసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీ వీడియోలను పోస్టు చేస్తున్నారు. యువత వాడే భాషను ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో రీల్స్‌కే పరిమితం కాకుండా కెరీర్‌పైనా దృష్టిపెట్టాలని సూచించారు. ఇదిలా ఉంటే.. కోవింద్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం దిల్లీలో జరిగింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




