– శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం రేవంత్
సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 19 : సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సిద్దిపేట , దుబ్బాక నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఇందిరమ్మ విగ్రహానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. అక్కడినుంచి బహిరంగ సభా ప్రాంగణానికి పాదయాత్రగా బయలుదేరారు. సీఎంతోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రగా బహిరంగ సభాస్థలికి వెళ్లారు. కాగా, ఒక్కొక్కొ చోట రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి, జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో రూ.15.44 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి, రూ.13.50 కోట్లతో ఆరు తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే చిన్న కోడూరు మండలంలో రూ.7.50 కోట్లతో, దౌల్తాబాద్ మండలంలో రూ.7.80 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన. జనగామ నియోజకవర్గంలో రూ.6.89 కోట్లతో మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
ప్రారంభోత్సవాలు
జిల్లాలో రూ.54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్ స్టేషన్లకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో రూ.14.35 కోట్లతో నిర్మించిన వసతి సత్రం, రూ.12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. రూ.6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ మహిళా సంఘాల భవనాలకు, రాయపోల్ మండలంలో రూ.3.87 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. గజ్వేల్‌లో రూ.1.59 కోట్లతో నిర్మించిన విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయానికి కూడా ప్రారంభోత్సవం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




