హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా మంగళవారం మెట్టుగూడ చౌరస్తాలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మాట్లాడుతూ అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ కుటుంబ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఖైరతాబాద్‌లో బుధవారం నిర్వహించే ‘సేవా జ్యోతి యాత్ర’ను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
బిహార్ బస్తీలో అంగన్ మిలాన్ సేవా కార్యక్రమం
మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి పరిధిలోని బిహార్ బస్తీ అంగన్‌వాడీ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘అంగన్ మిలాన్ సేవా అభియాన్’ వైభవంగా జరిగింది. రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులతో మాట్లాడారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు స్కూల్ బ్యాగులు, విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను ఆయన శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, బస్తీ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఓటరు జాబితా ప్రక్షాళనపై కాంగ్రెస్ దుష్ప్రచారం: రామచందర్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్, ఇండీ కూటమి నాయకులు ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని రాbచందర్ రావు విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018లో తెలంగాణలో 70 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ నేతలే ఆరోపించారని, ఇప్పుడు ఓటరు జాబితా ప్రక్షాళన జరుగుతుంటే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. అసదుద్దీన్ ఒవైసీ ఒత్తిడికి తలొగ్గి ‘రేవంతుద్దీన్’ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ఫారమ్-6, ఫారమ్-7 ద్వారా అభ్యంతరాలు తెలపడం చట్టబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. భారతదేశ పౌరుల ఓటు హక్కును ఎవరూ తొలగించలేరని, కానీ బంగ్లాదేశీయులు, రోహింగ్యాల అక్రమ ఓట్లను తొలగించి తీరుతామని ఆయన తేల్చిచెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





