కంటి ఆపరేషన్‌పై నివేదిక పంపండి

– జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిని నివేదిక కోరిన టీజీహెచ్‌ఆర్‌సీ
హైదరాబాద్, అక్టోబర్ 6, సిరిసిల్లకు చెందిన కొమ్ము వెంకమ్మకు ఎడమ కంటికి బదులుగా కుడి కంటికి శస్త్రచికిత్స చేసినట్లు వచ్చిన వార్తా కథనాన్ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్(టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. ఈ ఆరోపణలు నిజమైతే వైద్య నిర్లక్ష్యం, రోగి భద్రత, శస్త్రచికిత్సకు సంబంధించి పొందిన సమ్మతి వంటి అంశాలపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయని కమిషన్ పేర్కొంది. ఈ ఘటనపై రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి నుంచి సమగ్ర నివేదికను కోరింది. రోగికి సంబంధించిన వైద్య రికార్డులు, సూచించిన, నిర్వహించిన శస్త్రచికిత్స వివరాలు, రోగి/కుటుంబ సభ్యుల నుంచి పొందిన సమ్మతి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, నిర్వహించిన విచారణ వివరాలను నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది. ఈ నివేదికపై నవంబర్ 6న విచారణ జరపనుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *