గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం

భూసేకరణకు రూ.250 కోట్లు విడుదల
రైతులు సహకరించాలి: మంత్రి పొన్నం

సిద్దిపేట ప్రజాతంత్ర, ఆగస్టు 6: గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు సాగునీరందించడం తన బాధ్యత అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రాజెక్టు కాలువల భూసేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.250 కోట్లు విడుదల చేసిందని, రైతులు భూసే కరణకు సహకరిస్తే పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయప రమైన చిక్కులు తొలగిపోయాయని, కుడి, ఎడమ కాలువల తో పాటు డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో గురువారం పాల్గొన్న మంత్రి పొన్నం ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా కోహెడ మార్కెట్ కమిటీలో వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ కమిటీలో రూ.1.61 కోట్లతో నిర్మించనున్న ఓపెన్ షెడ్, ఫ్లాట్ఫారం, మీటింగ్ హాల్ పనులకు శంకుస్థాపన చేశారు. వనమహో త్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కోహెడ మండలం ధర్మసాగర్పల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన జీపీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని పేర్కొన్నారు. కోహెడ తంగళ్లపల్లి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, భూగర్భ జలాల సంరక్షణ కోసం బోర్వెల్ రీఛార్జ్ పాయింట్ల సంఖ్యను పెంచాలని సూచించారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి, జిల్లా మార్కెటింగ్ అధికారి దుర్గం ప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మల జయరాజ్, వైస్ చైర్మన్ భీంరెడ్డి తిరుపతి రెడ్డి, ధర్మసాగర్పల్లి సర్పంచ్ కరివేద చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మాలోతు రవీందర్ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *