– కేయూ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య
– వాగ్దేవిలో ఘనంగా ‘ఫార్మా-డీ’ వీడ్కోలు వేడుకలు
వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 6 : ఫార్మసిస్టుల సేవలు దేశానికి చాలా ముఖ్యమని, వారు వెన్నెముక వంటి వారు, ఫ్రంట్ లైన్ వారియర్స్ అని కేయూ ఫార్మసీ కాలేజీ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య అన్నారు. హెల్త్ కేర్ సిస్టం మొట్టమొదటగా కాపాడేది ఫార్మసిస్టులేనని, హిడెన్ డాక్టర్ గా, ప్రైమరీ డాక్టర్ గా సేవలందిస్తారని తెలిపారు. వాగ్దేవి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్‌లో 6వ సంవత్సరం పూర్తి చేసుకున్న ఫార్మా-డీ విద్యార్థులకు గురువారం ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ వేడుకకు సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్వప్న రెడ్డి, ఫార్మా-డీ హెచ్‌ఓడీ డాక్టర్ ప్రత్యూష, ఆచార్య సమ్మయ్యలు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సమ్మయ్య మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో క్రమశిక్షణ, కృషి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ‘మన శరీరం శాశ్వతం కాదు.. కానీ ఫార్మసీ విద్యార్థులకు పరిశోధనల రూపంలో ఎల్లకాలం జీవించి ఉండే అద్భుతమైన అవకాశం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైంటిఫిక్ ఆర్టికల్స్, నిబద్ధతతో కూడిన పరిశోధనల ద్వారా మీ ప్రతిభను చాటుకోవాలి’ అని పిలుపునిచ్చారు. నిబద్ధతతో కూడిన పరిశోధనలు చేసి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, మన శరీరం శాశ్వతం కాదు, కానీ ఫార్మసి విద్యార్థులకు మంచి అవకాశం ఉందని, సైన్స్ రూపంలో మనం ఎల్లకాలం బతికి ఉండొచ్చని, అది రీసెర్చ్ లో మనం కనబరిచే ప్రతిభపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రపంచ దేశాలు కోవిడ్ 19, ఎబోలా, క్యాన్సర్, డయాబెటిస్, న్యూరో డి జనరేటివ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ కు కావలసిన మందులు పరిశోధనల దశలో ఉన్నాయని, అందులో మీరు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. సైంటిఫిక్ మెథడాలజీని పాటిస్తూ కొత్త మందులు కనుక్కోవాలని, ఫార్మసిస్టుగా ప్రజలకు రేషనల్ యూజెస్ ఆఫ్ మెడిసిన్ గురించి తెలియజేయాలన్నారు. రీసెర్చ్ చేస్తున్నప్పుడు డాక్యుమెంటేషన్, సైంటిఫిక్ ఎవిడెన్స్ రికార్డు చేయాలని, వాలిడేషన్ పాటించాలని సూచించారు. డాక్టర్, ఫార్మసిస్ట్ కలిసి విదేశాల మాదిరిగా భారతదేశంలో సేవలు అందిస్తే దేశంలో 100% ఆరోగ్యం పరిరక్షించవచ్చని. ఫార్మసీ విద్యార్థిని విద్యార్థులకు బంగారు భవిష్యత్తు క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డ్రగ్ రెగ్యులేటరీ, ఫార్మకో విజిలెన్స్, సాస్ కోర్సెస్, మెడికల్ కోడింగ్, ఇవే కాకుండా క్లినికల్ ఫార్మసిస్ట్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్, అనలిస్ట్, వంటి ఉద్యోగ అవకాశాలే కాక గ్రూప్-బి, గ్రూప్-ఎ, సివిల్ సర్వీస్ వంటి రంగాలలో కూడా ఉద్యోగ అవకాశాలకు అవకాశం ఉందని, వాటికి కూడా మీరు ప్రిపేర్ కావచ్చు అని తెలిపారు. విద్యార్థులు సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని, గౌతమ బుద్ధుని ఆలోచన విధానాన్ని పాటిస్తూ జీవన విధానాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ప్రిన్సిపాల్ స్వప్న రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యా ఉద్యోగ రంగాలలో విజయాలు సాధించి కళాశాలకు మంచిపేరు తీసుకరావాలని ఆకాంక్షించారు, ఆరేళ్ల డిగ్రీని పూర్తి చేసి మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ స్వప్న రెడ్డి, ఫార్మా డి హెడ్ డాక్టర్ ప్రత్యూష అభినందించారు. అనంతరం సీనియర్ విద్యార్థులు కళాశాలలో హాస్పిటల్ లో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో సీనియర్ ఆచార్యులు డాక్టర్ విజిత , డాక్టర్ రత్నాకర్ , అధ్యాపకులు,
విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





