భారీగా పోలీస్ బాస్‌ల బదిలీలు

– హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్
– సజ్జనార్, స్టీఫెన్ రవీంద్రలకు కొత్త పోస్టింగ్‌లు!
– కీలక విభాగాల అధిపతుల మార్పు
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనలో వేగం పెంచే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఒకేసారి 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సహా పలు కీలక విభాగాల అధిపతులు మారారు. వివరాలిలావున్నాయి. మహేష్ మురళీధర్ భగవత్ (1995 బ్యాచ్) – హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా (సీపీ) నియమితులయ్యారు. వి.సి.సజ్జనార్ – ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్‌గా, డాక్ట‌ర్ సౌమ్య మిశ్రా – డీజీపీ, విమెన్ అండ్ సేఫ్టీ (షీ టీమ్స్ , భరోసా)గా బదిలీ అయ్యారు (ప్రూడెన్షియల్ అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు). స్వాతి లక్రా, జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా,  కార్తికేయ – మల్టీ జోన్-1 ఐజీగా,  రమేష్ నాయుడు రైల్వే ఐజీగా నియమితులయ్యారు. ఇంకా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారు సిన్హా, లా అండ్ ఆర్డర్ డీజీగా అకున్ సభర్వాల్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీపీగా విక్రమ్ సింగ్‌ మాన్, పౌరసరఫరాల కమిషనర్ గా వై.నాగిరెడ్డి, ఆర్టీసీ ఎండీగా డాక్ట‌ర్ అనిల్ కుమార్,  ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్ గా స్టీఫెన్ రవీంద్ర, అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ గా ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ జాయింట్ డైరెక్టర్ గా డి.జోయల్ డేవిస్ (హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా అదనపు బాధ్యతలు కూడా), డీఐజీగా జి.చందనదీప్తి, (జోన్–7 జోగులాంబ, అదనపు బాధ్యతలు), డీఐజీగా ఆర్.భాస్కరన్ (తెలంగాణ ఇంటెలిజెన్స్ అదనపు బాధ్యతలు), డీఐజీగా కే.నారాయణ నాయక్ (జోన్–2 బాసర, అదనపు బాధ్యతలు), డీఐజీ కోఆర్డినేషన్ గా ఎల్.ఎస్.చౌహాన్ (జోన్-6 చార్మినార్ డీఐజీగా అదనపు బాధ్యతలు), డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్)గా శ్రీబాలాదేవి, డీసీపీ, ఎస్ఎం అండ్ ఐటీ– హైదరాబాద్ గా వి.అరవింద్బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *