సువిధా కిచెన్స్‌ నూతన షోరూం ప్రారంభం

– హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, బేకరీలకు ఆధునిక వంట గది పరికరాలు

ఖైరతాబాద్, నవంబర్‌ 17(ప్రజా తంత్ర): హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, బేకరీలకు అవసరమైన ఆధునిక కిచెన్‌ పరికరాలు, సాంకేతిక పరిష్కారాలను అందిస్తున్న సువిధా కిచెన్స్‌ సంస్థ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 3లో నూతన షోరూంను ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌. వెంకట్‌ రెడ్డి, కార్యదర్శి చలువాది వేణుగోపాల్‌, ఎక్సలెన్స్‌ హాస్పిటాలిటీ సహ వ్యవస్థాపకుడు పి. శ్రవణ్‌ కుమార్‌, టీఎచ్‌ఐ కన్సల్టెన్సీకి చెందిన విశ్వనాథ్‌ పాండే హాజరయ్యారు. 1994లో హుబ్లీలో ప్రారంభమైన సువిధా కిచెన్స్‌ 30 ఏళ్లకు పైగా తయారీ రంగంలో అనుభవంతో దేశవ్యాప్తంగా సేవలందిస్తోంది. కిచెన్‌ ప్లానింగ్‌, డిజైనింగ్‌, పరికరాల సరఫరా, ఇన్‌స్టాలేషన్‌ సేవలతో పాటు 30కి పైగా ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను అందిస్తోంది. వీటిలో రిఫ్రిజిరేటర్లు, కాఫీ మెషీన్లు, ఐస్‌ మెషీన్లు తదితర ఆధునిక పరికరాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సేవలందించడంతో పాటు విదేశాలకు కూడా ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాహిల్‌ అరోరా మాట్లాడుతూ… హైదరాబాద్‌లో ఆహార, రెస్టారెంట్‌ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని, వినియోగదారులకు నాణ్యమైన కిచెన్‌ పరికరాలతో పాటు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. వ్యాపారంతో పాటు వినియోగదారులతో దీర్ఘకాలిక సంబంధాలు, నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. డిసెంబర్‌ నుంచి ప్రతి నెలా ఈ షోరూంలో లైవ్‌ కుకింగ్‌ ప్రదర్శనలు, విజ్ఞాన కార్యక్రమాలు, చెఫ్‌లు, రెస్టారెంట్‌ యజమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు www.suvidhakitchens.com వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *