ర‌ణ‌రంగంగా వరదరాజపూర్

– కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం
– బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ
– కేసీఆర్, రేవంత్ల దిష్టిబొమ్మలు దగ్ధం
– ఫామ్ హౌజ్ పరిసరాల్లో పోలీస్ బందోబస్తు

మర్కుక్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజపూర్, ఎర్రవల్లి గ్రామాల్లో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి.మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ముట్టడికి కాంగ్రెస్ నేతలు భారీగా తరలిరావడంతో రాజకీయంగా హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అంక్షారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట సర్సారెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డప్పు చప్పుళ్లు,జై కాంగ్రెస్ నినాదాలతో ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వైపు ర్యాలీతో ముట్టడికి బయలుదేరారు. ఎమ్మెల్సీ తాతా మధు ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ముందస్తు సమాచారం అందడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మర్కుక్, ఎర్రవల్లి, వరదరాజపూర్ పరిస రాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్ శ్రేణులను వరదరాజపూర్ శివారులోనే అడ్డుకున్నారు.పోలీ సులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.పో లీసులకు,కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటుచే సుకుంది. అదే సమయంలో వరదరాజపూర్ గ్రామం రాజకీయ రణరం గంగా మారింది. బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు దగ్ధం చేశారు. దీనికి ప్రతీకారంగా కేసీఆర్ దిష్టిబొ మ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశాయి. ఒకరిపై ఒకరు పరస్పర నినాదా లతో గ్రామం దద్దరిల్లింది.పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు ఇరువర్గా లను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ పరిసరాల్లో 144 సెక్షన్ వాతావరణం నెలకొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *