– ఎంపీ అరుణ విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : అసెంబ్లీ అవరణలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అయిన సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలతో పోలీసులు వ్యవహరించిన తీరు చాలా హేయమైనదని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఒక ప్రకటనలో అన్నారు. మహిళా శాసన సభ్యులపై పోలీసులు అనుచితంగా ఎవరి ఆదేశాల ప్రకారం ప్రవర్తించారు.. సీఎంగానా, హోం మంత్రిగానా ఏ హోదాలో పోలీసులను ఆదేశించారు అంటూ ప్రశ్నించారు. పాలకులకు కొంచెమైనా సిగ్గు అనిపించడంలేదా అని అడిగారు. > స్పీకర్‌పై ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు కోరాలని, చర్యలు తీసుకోవాలని సభలో చర్చించారని, దాంతోపాటు మహిళా శాసన సభ్యులపై వ్యవహరించిన తీరుపై చర్చ పెట్టాలి అని డిమాండ్ చేశారు. మహిళా శాసనసభ్యులను ఎందుకు అవమానించాల్సి వచ్చింది, మహిళా ఎమ్మెల్యేల మెడ, వెంట్రుకలు పట్టుకుని గుంజడం, చీర లాగడంపై నోరు విప్పకపోవడం కన్నా దారుణం ఏమైనా ఉంటుందా అని నిలదీశారు. ఆ పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవాలన్నారు. పార్టీలు వేరైనా సాటి ఎమ్మెల్యేలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుందన్నారు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఇంకో న్యాయం సరైంది కాదన్నారు. మహిళ పట్ల మరింత గౌరవం ఉండాలిలని సూచించారు. ఇది పార్టీలకు సంబంధం లేని అంశమని, ఒక మహిళగా, పార్లమెంటు సభ్యురాలిగా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాని అరుణ అన్నారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




