వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం

– డీజీపీ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 26 : డీజీపీ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, భారతీయ సాహిత్యానికి, ఆధ్యాత్మికతకు విశేష సేవలందించిన మహానీయుడని పలువురు కొనియాడారు. చెడు నుంచి సన్మార్గం వైపు పయనించి సమాజానికి మానవతా విలువలను చాటిచెప్పిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, ఏఐజీ(అడ్మిన్) జె. అన్యోన్య, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ యోగేశ్వర రావు, పేషీ డీఎస్పీ భాస్కర్‌తోపాటు సీఏవోలు, ఏఓలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *