వైమానిక దళ జవాన్లతో దీపావళి వేడుకలు

– మిఠాయిలు పంచిన రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్

కోల్‌కతా, నవంబర్ 7 : పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా ఎయిర్‌ఫీల్డ్‌లో భారతీయ వైమానిక దళ ¾(ఐఏఎఫ్) సిబ్బందితో కలిసి కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ దీపావళి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన సైనికులకు స్వయంగా మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  జవానులనుద్దేశించి మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో మీరు ప్రదర్శించే ధైర్యం, అంకితభావం అద్భుతమైనవని కొనియాడారు. సైనికుల ప్రవర్తన, క్రమశిక్షణ, భాష స్థానిక ప్రజల్లో సైన్యంపై గొప్ప గౌరవాన్ని పెంచుతాయన్నారు. స్థానిక ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని ఆయన జవాన్లకు సూచించారు. శత్రువులు ఇప్పుడు నేరుగా సరిహద్దుల్లో తలపడటమే కాక సైబర్‌దాడులు, డ్రోన్ దాడులు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు (ఇన్ఫర్మేషన్ ఆపరేషన్స్) చేస్తూ సైనికులను, స్థానిక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని రక్షణ మంత్రి హెచ్చరించారు. ఇలాంటి ఆధునిక ముప్పులను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ అత్యంత అప్రమత్తతతో ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, వైమానిక స్థావరంలో ఇద్దరు ఐఏఎఫ్ జవాన్లు పాడిన ‘జీనే కీ ఇజాజత్ దే దే యా హుక్మ్ షహాదత్ దే దే’, ‘ఓ దేశ్ మేరే’ దేశభక్తి గీతాల 45 సెకన్ల వీడియోను రాజనాథ్ సింగ్ తన ‘ఎక్స’ ఖాతాలో పంచుకుంటూ జవాన్ల ప్రతిభను మనసారా అభినందించారు.

రెండు రోజుల పర్యటన 

శనివారం బాగ్‌డోగ్రా ఎయిర్ ఫీల్డ్, సిలిగురి సమీపంలోని సుక్నా మిలిటరీ క్యాంపులో జవాన్లతో గడిపిన అనంతరం ఆయన సిక్కింలోని సరిహద్దు ప్రాంతమైన నాథూ లాకు వెళ్లనున్నారు. అక్కడ ఆదివారం దీపావళి రోజున శేరథాంగ్ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *