అసమానతలు తొలగాలి

– ప్రజలకు బీజేపీ చీఫ్ రామచందర్ రావు దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : చీకటిని చీల్చి వెలుగులు నింపే ఈ దీపాల పండుగ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త ఆశలను, ఆనందాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఈ పర్వదినం తెచ్చే దివ్య కాంతులు మీ ఇళ్లలో సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను, ఆర్థిక శ్రేయస్సును నింపాలని ఆకాంక్షించారు. మన సమాజంలో అన్యాయం, అసమానతలు తొలగిపోయి అభివృద్ధి, శాంతి వెల్లివిరియాలని భగవంతుడిని ప్రార్థించారు. అందరం కలిసి సురక్షితంగా, పర్యావరణానికి మేలు చేసేలా ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను జరుపుకుందామని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *