గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కేంద్రంగా హైదరాబాద్

– ‘ఆర్థా ఫిన్‌టెక్’ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : ఫిన్‌టెక్, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకు హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రపంచస్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌లో పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ)కి ప్రోత్సాహం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థా ఫిన్‌టెక్ హైదరాబాద్ కార్యాలయాన్ని హైటెక్ సిటీలో ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఐటీ/ఐటీఈఎస్ రంగంలో హైదరాబాద్ సాధించిన అంతర్జాతీయ గుర్తింపును ఫిన్‌టెక్, డిజిటల్ బ్యాంకింగ్, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకూ విస్తరించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లో భాగంగా పెట్టుబడులకు, ఆవిష్కరణలకు, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌కు దేశంలోనే అత్యుత్తమ గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. గ్లోబల్ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌కు విస్తరించేలా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ ఎకో సిస్టం”ను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. బ్యాంకింగ్-యాజ్-ఏ-సర్వీస్, ఓపెన్ బ్యాంకింగ్ ఏపీఐలు, ఆటోమేటెడ్ ఆన్‌బోర్డింగ్, కేవైసీ/కేవైబీ, ఏఎంఎల్, అంతర్జాతీయ చెల్లింపులు, డిజిటల్ వాలెట్ మౌలిక సదుపాయాలు తదితర ఫైనాన్షియల్ టెక్నాలజీ పరిష్కారాలను ఆర్థా ఫిన్‌టెక్ అందిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. కార్యక్రమంలో కంపెనీ సీఈవో మధుబాబు గడిపాటి, ఆర్మిన్ ఒర్డోడరీ, ఇమాన్యుయేల్ సి.ఫెర్నాండెస్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *