లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

ఆదిలాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ ఎస్సై రమేష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇటీవల జరిగిన యువతి ఆత్మహత్య కేసులో నిందితులను తప్పించడానికి లంచం డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారులు ఏసీబీని ఆశ్రయించారు. బుధ వారం గ్రామ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద సెంటరింగ్ బాక్స్ కింద రూ.40 వేలు లంచం డబ్బు పెట్టాలని సూచించిన మేరకు ఫిర్యాదుదారుడు నగదును ఉంచాడు. ఎస్సె ఆ నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్సెని పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కరీంనగర్లో ఏసీబీ కోర్టులో హాజరుపరిచామని ఉన్నతాధికారులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *