నిరుద్యోగులను వంచిస్తున్న రేవంత్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తగా నిరుద్యోగులు, యువత ఉద్యోగ నోటిఫికేషన్లు కోసం ధర్నాలు చేస్తుంటే ముఖ్యమంత్రి ఏమో నోటిఫికేషన్లు యువతే నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తున్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో ఇంటరాక్ట్ అయి
విద్యార్థులను ప్రిపరేషన్ ఎలా అవుతున్నారు, వారి సమస్యలు అడిగి తెలుసున్న హరీశ్ రావు ఈ సందర్బంగా మాట్లాడుతు…రెండున్నర ఏండ్లుగా యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదు..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదే 2లక్షల ఉద్యోగాలు అంటూ నమ్మబలికారు. ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని చెప్పాడు. నాడు బస్సు యాత్రలతో నిరుద్యోగులను రెచ్చగొట్టి నమ్మించారు..నేడు వంచించారు అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *