శాసన మండలి మాజీ చైర్మన్ చక్రపాణి మృతి విచారకరం

– సీఎం రేవంత్ నివాళి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ డాక్టర్ చక్రపాణి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలిని పునరుద్ధరించిన అనంతరం తొలి చైర్మన్‌గా డాక్టర్ చక్రపాణి ఎంతో నిబద్ధతతో పనిచేశారని గుర్తు చేసుకున్నారు. పార్లమెంటరీ సంప్రదాయాల పట్ల అపారమైన గౌరవం కలిగిన ఆయన చైర్మన్‌గా నిష్పక్షపాతంగా వ్యవహరించారన్నారు. దాదాపు ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో అంకితభావంతో ఆయన ఎన్నో సేవలందించారని కొనియాడారు. డాక్టర్ చక్రపాణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాళి

చక్రపాణి మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న చక్రపాణి నివాసానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చక్రపాణితో తనకున్న అనుబంధాన్ని ఆయన కుటుంబ సభ్యులతో గుర్తు చేసుకున్నారు. చక్రపాణి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తన సానుభూతిని తెలియజేస్తూ వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. దివంగత నేత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *