ప్రభుత్వోద్యోగులకు రెండు డీఏలు మంజూరు

– ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండు డీఏలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2024 నుంచి 33.67 శాతం నుంచి 37.31 శాతానికి పెంచింది. అలాగే జూలై 2024 నుంచి 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాక 2015 పే స్కేల్ ఉద్యోగులకు కూడా డీఏ 73.344 శాతం నుంచి 78.06 శాతానికి పెంచింది. జూలై 2024 నుంచి 78.06 శాతం నుంచి 81.728 శాతానికి, 2020 పే స్కేల్ ఉద్యోగులకు డీఏ 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచింది. యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేళ్ల ఉద్యోగులకు కూడా డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016 పే స్కేల్ ఉద్యోగులకు డీఏ 46 శాతం నుంచి 50 శాతానికి, జూలై 2024 నుంచి డీఏ 50 శాతం నుంచి 53 శాతానికి పెంచింది. అలాగే 2006 పే స్కేల్ ఉద్యోగులకు డీఏ 230 శాతం నుంచి 239 శాతానికి, జూలై 2024 నుంచి 239 శాతం నుంచి 246 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ అక్టోబర్ జీతంతో కలిపి నవంబర్ 1న చెల్లించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *