ఆర్మ్ రెజ్లింగ్‌లో రాధికకు కాంస్య పతకం

– అభినందించిన డిజిపి ఆనంద్

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: జాతీయస్థాయి ఆర్మ్ రెజ్లింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ పోలీస్ క్రీడాకారిణి జి.రాధికను (డబ్ల్యూపీసీ-2405) డిజిపి సి.వి.ఆనంద్ తన కార్యాలయంలో బుధవారం అభినందించారు. క్రీడల్లో రాణిస్తూ తెలంగాణ పోలీస్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. హర్యానాలోని కర్ణాల్‌లో సెప్టెంబరు 23 నుంచి 27 వరకు జరిగిన 75వ అఖిల భారత పోలీస్ రెజ్లింగ్ క్లస్టర్-2026లో రాధిక ఈ ఘనత సాధించారు. మహబూబ్‌నగర్ జిల్లా అడకల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆమె మహిళల 90 ం కిలోల ఆర్మ్ రెజ్లింగ్ విభాగంలో పోటీపడి మూడో స్థానంలో నిలిచారు. జాతీయస్థాయిలో తెలంగాణ పోలీస్‌కు పతకం సాధించిన రాధికను ఐజి (పి అండ్ ఎల్) గజరావు భూపాల్, స్పోర్ట్స్ డిఎస్పీ రామారావు పోలీస్, ఇతర ఉన్నతాధికారులు, స్పోర్ట్స్ విభాగం అధికారులు అభినందించారు. పోలీస్ సిబ్బంది క్రీడల్లో రాణించేందుకు శాఖ అందిస్తున్న ప్రోత్సాహానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *