ట్రైనీ ఐపీఎస్‌ ‌కృష్ణారెడ్డికి 14రోజుల రిమాండ్‌

-‌ చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు
– మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను వేధించినట్లు రుజువులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 29: తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డికి ఉప్పర్‌పల్లి కోర్టు రిమాండ్‌ ‌విధించింది. మిర్యాలగూడ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని ఉమెన్‌ ‌సేప్టీ వింగ్‌కు అప్పగించారు. బుధవారం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతడికి ఆగస్టు 11 వరకు రిమాండ్‌ ‌విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆమేరకు పోలీసులు భారీ భద్రత మధ్య  అత‌డిని చంచల్‌ ‌గూడ జైలుకు తరలించారు. మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై ఉదయ్‌కృష్ణారెడ్డి దాడి చేసినట్టు వైద్యపరీక్షల్లో నిర్దారణ అయినట్టు తెలిసింది. కేసు నమోదైన జూలై 18న బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెపై భౌతికంగా దాడి జరిగినట్టు తేల్చారు. బాధితురాలి గొంతు నులిమినట్టు గాయాల ఆనవాళ్లు, చెంప భాగంలో కొట్టిన కమిలిన గాయాలు, ఎడమ కాలిపైనా గాయం ఉన్నట్టు సమాచారం. నేషనల్‌ ‌పోలీస్‌ అకాడలో తోటి ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ‌లో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం నిందితుడు ఉదయ్‌ ‌కృష్ణారెడ్డి ఆమెపై మానసికంగా, శారీరకంగా తీవ్ర స్థాయిలో వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమెను వాట్సాప్‌ ‌ద్వారా లైంగికంగా వేధించడమే కాక త‌మ‌ మధ్య రిలేషన్‌ ‌షిప్‌ ఉం‌దంటూ తోటి ట్రైనీ అధికారుల వద్ద అసత్య ప్రచారాలు చేశాడు. అంతటితో ఆగక మరో ట్రైనీ అధికారితో ఆమెకు అక్రమ సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అవమానించాడు. బాధితురాలిని అత్యంత అసభ్యకరమైన పదాలతో దూషిస్తూ మానసిక క్షోభకు గురిచేసినట్లు సమాచారం. బాధితురాలికి తెలియకుండానే ఆమె వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసిన ఉదయ్‌, ‌వాటి ఆధారంగా ఆమెను బ్లాక్‌మెయిల్‌ ‌చేయడానికి యత్నించాడని బాధితురాలు పేర్కొంది. ఆ వీడియోలను ఆమె భర్తకు పంపి తీవ్ర మనోవేదన కలిగించాడు. అంతేకాక ఆమె మొబైల్‌ ‌ఫోన్‌ను బలవంతంగా తన గదికి తీసుకెళ్లి పాస్‌వర్డ్ ‌చెప్పాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపింది. అదే సమయంలో ఆమెను అసభ్యకరంగా తాకుతూ తీవ్రంగా వేధించినట్లు ఫిర్యాదులో నమోదైంది. ఈ నెల 9న రాత్రి బాధితురాలిని బలవంతంగా తన గదికి తీసుకెళ్లి బంధించిన ఉదయ్‌ ‌కృష్ణారెడ్డి జుట్టు పట్టుకుని లాగి, గొంతు నులిమేందుకు ప్రయత్నించాడు. గది నుంచి బయటకు వెళ్లకుండా మెడపై కత్తి పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. తన ను అవమానించే ఉద్దేశంతో మూడు కండోమ్‌ ‌ప్యాకెట్లను పైకి విసిరాడు. అనంతరం ఈ నెల 10న ఉదయం కూడా ఆమెపై తీవ్రంగా శారీరక దాడికి పాల్పడ్డాడు. అకాడమీలో ఇతరుల సమక్షంలోనూ అసభ్యకరంగా మాట్లాడి తన పరువుకు భంగం కలిగించాడని బాధితురాలు తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *