యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం

– లోక్ సభలో మూజువాణి వోటుతో ఆమోదం
– విపక్షాల సవరణలను తిరస్కరించిన ప్రభుత్వం
– పార్లమెంటరీ వ్యవహారాలపై రాహుల్ గాంధీకి అవగాహన లేదన్న జితేంద్ర సింగ్
– బిల్లు ఆమోదంతో సభ నేటికి వాయిదా

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 29: వాడీవేడి చర్చలు.. విమర్శలు ప్రతి విమర్శలు, ఆక్షేపణల మధ్య పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. చర్చల అనంతరం బిల్లును మూజువాణి వోటుతో సభ ఆమోదించింది. బిల్లులో మార్పులు చేయాలంటూ విపక్షాలు ప్రతిపాదించిన సవర ణలను ప్రభుత్వం తిరస్కరించింది. పశ్నపత్రాల లీకేజీ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడడమే బిల్లు
లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం అనంతరం లోక్సభ సమావేశాలను స్పీకర్ ఓం బిర్లా గురువారానికి వాయిదా వేశారు. కాగా,పేపర్ లీక్ కేసుల్లో దోషులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు. ఇదివరకు 3-5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10లక్షల వరకు జరిమానా ఉండేది. అదే వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు. జరిమానా ఉంది. విపక్షాలు పలు సవరణలు కోరినప్పటికీ అవి వీగిపోయాయి. పేపర్ లీక్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి బిల్లులో నిబంధ నలు రూపొందించామని తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *