డిజిటల్‌ ‌సేవల విస్తృతి, ప్రమాణాలు పెంచాలి

– అత్యుత్తమ డిజిటల్‌ ‌పౌరసేవల వేదికగా మీ-సేవను తీర్చిదిద్దాలి
– అధికారులతో ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ‌జాజు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 29 : ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు మీ-సేవ వ్యవస్థను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్‌ ‌పౌర సేవల వేదికగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ‌జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మీ-సేవ విభాగం పనితీరుపై సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, ఈ-గవర్నెన్స్ ‌ప్రాజెక్టులు, డిజిటల్‌ ‌సేవల పురోగతిని సీఎస్ ‌సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి మీ-సేవ ద్వారా అందించే సేవల పరిధిని మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 33 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అనేక సేవలు మీ-సేవ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవలను ఈ వేదికలో చేర్చేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రస్తుత ఆధునిక సమాచార సాంకేతికత, కృత్రిమ మేధస్సు డేటా ఆధారిత పరిష్కారాలను మీ-సేవ వ్యవస్థతో అనుసంధానించి ఈ-గవర్నెన్స్ ‌సేవలను ప్రజల ముంగిటకు మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వీలైనన్ని ఎక్కువ సేవలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన, సమయాను కూలమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ప్రధాన కార్యదర్శి మీ-సేవను దేశంలోనే ఆదర్శవంతమైన పౌర సేవల వేదికగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీ శాఖ జాయింట్‌ ‌సెక్రటరీ అనుదీప్‌ ‌దురిశెట్టి, మీ-సేవ డైరెక్టర్‌  ‌రవికిరణ్‌తోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *