పర్యాటక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం

˜టూరిజం వనరులను వినియోగంలోకి తీసుకురావాలి
˜ప్రభుత్వానికి ఆదాయం రాని ప్రాజెక్టులపై సమీక్షించండి
˜ప్రీ బడ్జెట్‌ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌,ప్రజాతంత్ర, మార్చి 4 : రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధిపై ప్రజా ప్రభు త్వం అత్యంత ప్రాధాన్య మిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు తెలిపారు. మంగళవారం డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ సచివాల యంలోని ఉపముఖ్య మంత్రి కార్యాల యంలో 2025- 26 వార్షిక సంవత్సరానికి సంబంధించి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌, టూరిజం, కల్చర్‌, ఆర్కియాల జీ శాఖలకు సంబంధించి ఫ్రీ బడ్జెట్‌ సమావేశం జరిగి ంది.  ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన టూరిజం పాలసీని తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనకు అనుగుణంగానే బడ్జెట్‌ ప్రతిపా దనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి టూరిజం ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవడానికి కావలసిన వనరులు సమృద్ధిగా ఉన్నాయని, వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి  అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఎకో టూరిజం, మెడికల్‌- వెల్నెస్‌ టూరిజం, టెంపుల్‌ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి కోసం పర్యటక శాఖ రూపొందించిన ప్రతిపాదనలకు అనుగుణంగా బడ్జెట్లో తగిన ప్రాధాన్యతను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. పర్యాటక  అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖకు కేటాయించిన ప్రాంతాలు  అత్యంత విలువైన ఆస్తులుగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదని అన్నారు.  వాటిని నిర్దేశిత కాలంలో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా వినియోగంలోకి తీసుకురావడం వల్ల రాష్ట్రానికి ఆదాయ వనరులు వస్తాయన్నారు. పి పి పి (పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్నర్షిప్‌) పద్ధతిలో టూరిజం ప్రాజెక్టులను చేపట్టడానికి రాష్ట్రంలో చాలా మంది ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. పిపిపి పద్ధతిలో చేపట్టే పర్యాటక ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే పీపీపీ  పద్ధతిలో నడుస్తున్న టూరిజం ప్రాజెక్టుల నుంచి ఆదాయం రాకుంటే  వాటిని సమీక్షించాలని సూచించారు. ప్రాజెక్టుల వారీగా సమీక్షించి ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావడానికి కావలసిన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.

నగర ప్రజలు మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి హైదరాబాద్‌ నగరం చుట్టూ అటవీ శాఖ 59 బ్లాక్‌ లను గుర్తించి అర్బన్‌ పార్కులుగా అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారని, టూరిజం శాఖ కూడా  కొత్త ప్రాంతాలను గుర్తించి అభివృద్ధికి కావలసిన ప్రతిపాదనలు తయారు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ చుట్టూ అనేక రకాలుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఫారెస్ట్‌, టూరిజం శాఖలు సమన్వయంతో పని చేస్తే మంచి ఫలితాలు వొచ్చే అవకాశం ఉందన్నారు. వర్క్‌ ఫ్రం హోం పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న సాఫ్ట్వేర్‌ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని  సాఫ్ట్వేర్‌ ఇండస్ట్రీ పరిసర ప్రాంతాల్లో టూరిజం శాఖ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ కొత్త ప్రాజెక్టులను తీసుకురావాలని సూచించారు. సాఫ్ట్వేర్‌ ఉద్యోగులు అక్కడికి వచ్చి పని చేసుకోవడానికి కావలసిన ఆహ్లాదకరమైన వాతావరణం, వసతులు, తగిన భద్రత, వైఫై సౌకర్యం ఉండే విధంగా డిజైన్‌ చేసుకోవాలన్నారు.

ఇలాంటి కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు నిత్యం ఇంట్లో ఉండి పని చేస్తున్నామన్న ఫీలింగ్‌ ను దూరం చేసిన వారమవుతామని వివరించారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న హరిత హోటల్స్‌ నిర్వాహణ గురించి అడిగి తెలుసుకున్నారు.  పర్యాటకులు పెద్ద ఎత్తున హరిత హోటల్స్‌ ను వినియోగించుకునే విధంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు. నష్టాల్లో నడుస్తున్న హోటళ్ళను లాభాల బాటలోకి తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఫైనాన్స్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, కమర్షియల్‌ టాక్స్‌ కమిషనర్‌   సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ, ఎక్సైజ్‌ కమిషనర్‌ హరి కిరణ్‌, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్మితా సబర్వాల్‌, టూరిజం డైరెక్టర్‌ హనుమంతు జెండగే తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *