క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించండి

– ఇండ్ల లబ్దిదారులకు అందుబాటులో ఉండాలి
– హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో గ్రామ సమాఖ్యలతో సమన్వయం చేసుకోవాలని, వివరాలను పూర్తి పారదర్శకంగా సేకరించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచి జిల్లాల ప్రాజెక్టు డైరక్టర్లు, డిప్యూటీ ఇంజనీర్లు, ఏఈలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది సెప్టెంబరుకల్లా మొదటి విడతలో మంజూరైన ఇండ్లన్నీ పూర్తి అయ్యేలా పకడ్బందీ ప్రణాళికతో పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంతరెడ్డి నిర్దేశించినట్లు మరో లక్ష ఇంఢ్ల గృహ ప్రవేశాలు జరిగేలా కృషి చేయాలన్నారు. ఇందుకోసం ఏఈలు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ లబ్దిదారులు ఇండ్ల పనులను వేగవంతంగా పూర్తి చేసుకునేలా చైతన్యపరచాలని ఆయన ఆదేశించారు. వారు ఇంటి నిర్మాణాల కోసం అధిక మొత్తంలో ఖర్చు పెట్టి ఇబ్బందులు పడకుండా వారికి అవగాహన కల్పించాలన్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లోని డబుల్ బెడ్ రూం కాలనీల్లోని మౌలిక వసతుల కల్పన పనులను, వాటి కేటాయింపు ప్రక్రియపై సమీక్షిస్తూ ఆయా కాలనీల్లోనే (ఎక్కువ ఇండ్లు ఉన్న ప్రాంతాల్లో) గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పనులన్నీ యుద్దప్రాతిపదికిన పూర్తిచేయాలని గౌతం స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు గ్రామాల్లో గుడిసెల్లో నివస్తున్న వారి వివరాలను సమగ్రంగా సేకరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ ఎం.చైతన్య కుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ విజయకుమార్, జనరల్ మేనేజర్లు మమత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *