– నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం, గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతంలోని సరకా లేబొరేటరీస్ లిమిటెడ్‌లో ఈనెల 22న రాత్రి క్లోరోఫామ్ ఆవిరి లీకేజీ కారణంగా ఇద్దరు కార్మికులు మృతిచెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనకు సంబంధించి పలు తెలుగు, ఆంగ్ల పత్రికలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో వచ్చిన వార్తలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఈ ఘటన పారిశ్రామిక భద్రతకు సంబంధించి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా హామీ ఇచ్చిన జీవించే హక్కు పరిరక్షణ విషయంలో తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తోందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఘటనకు దారితీసిన పరిస్థితులు, మృతులు, గాయపడిన కార్మికుల వివరాలు, బాధితులకు అందించిన వైద్య సహాయం, పరిశ్రమలో అమలులో ఉన్న భద్రతా చర్యలు, సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై నవంబర్ 26లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని కమిషన్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కాగా, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీ అనంతరం పరిశ్రమను మూసివేయాలని ఆదేశించినట్లు సమాచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




