క్రికెటర్ వంశికకు కేటీఆర్ అభినందనలు

– అండగా ఉంటానని భరోసా

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జెడ్‌పీహెచఎస్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని గూడెపు వంశిక జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం పట్ల బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం తనను కలిసిన వంశికను ప్రత్యేకంగా అభినందించి జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వంశిక క్రికెట్‌లో సాధించిన విజయాలు, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తీరు, భవిష్యత్తు లక్ష్యాల గురించిన వివరాలు తెలుసుకున్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న గ్రామీణ ప్రాంత విద్యార్థినులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటూ వంశికకు అన్ని విధాలా అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో వంశిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలతో కూడిన ఉమ్మడి జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమె తన నాయకత్వ ప్రతిభతో జట్టును సెమీ ఫైనల్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. బౌలింగ్‌లోనూ ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకుంది. నవంబర్ మొదటి వారంలో జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వంశిక తెలంగాణ తరఫున తన ప్రతిభను చాటనుంది. గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదువుకుంటూ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పాఠశాలతోపాటు నామాపూర్ గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. వంశిక సాధించిన విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు కుంట శ్రీనివాస్‌ను, ఆమెకు ప్రోత్సాహం అందించిన పాఠశాల ఉపాధ్యాయులను అభినందిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *