పానగల్ ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు

– ముఖ్యమంత్రి, మంత్రి జూపల్లికి కృతజ్ఞతలు
– యునెస్కో గుర్తింపు దిశగా కృషి చేస్తా
– మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : శివలింగంపై నిరంతర ఛాయ కనిపించేలా నిర్మించిన పానగల్‌లోని చారిత్రక ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేయడం పట్ల రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఛాయా సోమేశ్వరాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ప్రపంచస్థాయిలో ఎక్కడా లేని విధంగా “వందల ఏళ్ల క్రితమే శిల్పులు కాంతి, నీడ, నిర్మాణ శాస్త్రాన్ని సమన్వయం చేసి శివలింగంపై నిరంతర ఛాయ కనిపించేలా నిర్మించిన ఛాయా సోమేశ్వరాలయం తెలంగాణ శిల్పకళా వైభవానికి, ప్రాచీన నిర్మాణ విజ్ఞానానికి అద్భుత నిదర్శనమన్నారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో చారిత్రక వారసత్వాన్ని కాపాడటంతోపాటు మరింత పర్యాటక ప్రాధాన్యత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. కాగా, మంత్రి చొరవతో ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల కావటంలో భక్తులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *