– జిల్లాలో రూ. 22.75 కోట్లతో గురుకుల, పబ్లిక్ స్కూల్ భవనాలకు శంకుస్థాపన
– వెల్టూరును త్వరలోనే మండల కేంద్రంగా ఏర్పాటు చేస్
– మంత్రి పొంగులేటి
వనపర్తి ప్రజాతంత్ర సెప్టెంబర్ 28; ప్రజా పాలన ప్రభుత్వం విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా పెద్దమందడి మండలంలోని వెల్టూరులో రూ.12.75 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్, వనపర్తి మండలం చిట్యాల పరిధిలో రూ.10 కోట్లతో నిర్మించనున్న జ్యోతి బా పూలే బాలుర గురుకుల కళాశాల భవనానికి పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి సోమవారంశంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదించిన ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసుకుంటున్నామ న్నారు. అదేవిధంగా పేదలు తమకు అనారోగ్యం వచ్చినపుడు మెరుగైన వైద్యం చేయించుకోలేక తమ వారు ప్రాణాలు కోల్పోయారని బాధపడకుండా ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నదన్నారు. తమ ప్రభుత్వంలో రైతులను రాజు చేయాలనే ఉద్దేశంతో పంటలకు కనీస మద్దతు ధర, రైతు భరోసా, రైతు రుణ మాఫీ, సన్న బియ్యనికి 500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఇప్పటికే వేలాది ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు కొత్తగా మరికొన్ని వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో 70 వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకే రుణాలు, పేదలకు ఇందిరమ్మ ఇల్లు, అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. గత పాలకులు లక్షల కోట్ల అప్పులు చేసి పోయినప్పటికి గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అమలు చేస్తూనే ఈ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చందుకు కృషి చేస్తున్నదన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి అభ్యర్థన మేరకు వెల్టూరు గ్రామాన్ని త్వరలోనే మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని కొత్త మండలాలు ఇవ్వడంతోపాటు కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ వెల్టూరులో 12.75 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మేఘారెడ్డి మాట్లాడుతూ అతిపెద్ద గ్రామమైన వెల్టూరును మండల కేంద్రం చేయాలని మంత్రిని కోరారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా విద్యాధికారి యాదయ్య, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




