ఓటర్లంటే భయం లేదా? 

– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
– యువకుడిని చెంపదెబ్బ కొట్టిన మంత్రి పర్వేశ్ వర్మపై అగ్ర‌హం     
దిల్లీ, సెప్టెంబ‌ర్ 28  : దిల్లీలో రోడ్ల‌ను త‌నిఖీ చేస్తుండ‌గా వీడియో తీసిన యువ‌కుడిని మంత్రి ప‌ర్వేశ్ వ‌ర్మ చెంప‌ దెబ్బ కొట్టడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ఘ‌ట‌న‌పై తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ స్పందించారు. మంత్రి తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ నేతలకు ఓటర్లంటే ఏమాత్రం భయం లేదని అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్య గురించి ప్రశ్నించినందుకు ఓ యువకుడిని చెంపదెబ్బ కొట్టడం సరైన చర్య కాదన్నారు. వీడియోలో దిల్లీ ప్రభుత్వానికి చెందిన బీజేపీ మంత్రి ఒక యువకుడిని చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తోందని, అతడు చేసిన నేరం ఏమిటి అని రాహుల్‌గాంధీ ప్ర‌శ్నించారు. ప్రజల మధ్యలో ప్రశ్నిస్తే చెంపదెబ్బ.. పేపర్ లీక్స్‌ గురించి అడిగితే లాఠీఛార్జి.. పార్లమెం ప్రశ్నిస్తే మైక్‌ స్విచ్ఛాఫ్‌ చేయడం.. ఇవన్నీ అధికారం ఉందనే అహంకారంతో చేసే చర్యలన్నారు. తప్పు చేస్తే ప్రజలు తమను గద్దె దించుతారనే భయం వారిలో లేదని విమ‌ర్శించారు. బీజేపీ నేత‌లు అధికారంలోకి వచ్చేది ఓటు చోరీతో అని, అందుకే వారికి ప్రజల మద్దతుతో అవసరం ఉండదని రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశా రు. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై మంత్రి పర్వేశ్‌ వర్మ స్పందిస్తూ ఇలాంటి విషయాలకు ఆయ‌న‌ దూరంగా ఉండాలని సూచించారు. ఆయనకు ఏమీ తెలియ‌క ఏదేదో మాట్లాడతార‌ని వ్యాఖ్యానించారు.

————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *