అగ్ర నాయకుల అక్రమాస్తులపై నిగ్గు తేల్చాసిందే

– ప్రజల‌లో పెరుగుతున్న‌ డిమాండ్‌

– ఇలానే వదిలేస్తే భవిష్యత్‌ ‌తరాలవారికి అన్యాయం

            (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి)

వివిధ పార్టీలకు చెందిన అగ్రానాయకుల అక్రమాస్తులపై సమగ్ర విచారణ జరుపాలని ప్రజలనుండి కూడా డిమాండ్‌ ‌వస్తున్నది. రాష్ట్రంలో చాలాకాలంగా అధికార, ప్రతిపక్షాల నేతలు ఒకరిపై ఒకరు అక్రమ ఆస్తులపై ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వేలు, లక్షల కోట్ల మేర ప్రజాధనాన్ని దోచుకుంటున్నట్లు వీరు చేసుకుంటున్న పరస్పర విర్శలను చూస్తుంటే ఇందుకేనా వీళ్ళను ఎన్నుకుని అధికార పదవుల్లో కూర్చోబెట్టిందంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఆరోపణలపై నిగ్గుతేల్చాల్సిందేనంటు వారు అభిప్రాయపడుతున్నారు. వీరిని ఇలానే వదిలేస్తే భవిష్యత్‌ ‌తరాలవారికి అన్యాయం చేసినట్లు అవుతుందంటున్నారు.ఇదే విషయంపై ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ)కూడా తాజాగా స్పందించింది. బహిరంగ వేదికలపైనే కాకుండా సాక్షాత్తు చట్టసభల్లో ఎదుటి పార్టీవారి అవినీతి, అక్రమాలపై ప్రజాప్రతినిధులు చేస్తున్న ఆరోపణలను అలా గాలికి వదిలేయడం సమాజానికి మంచిదికాదన్న అభిప్రాయంగా ఎఫ్‌జీజీ దీనిపై సమగ్ర విచారణ జరిపించా ల్సిందిగా గవర్నర్‌ను కోరింది. మాజీ  ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఆయన కుమారుడు మాజీ మంత్రి కెటిఆర్‌ ఆస్తులపై శాసనసభ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దానికి ప్రతిగా బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌కూడా తీవ్రంగా స్పందించారు. నిజంగానే ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమ కుటుంబ ఆస్తులతోపాటు, సిఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ ‌చేయడంతో ఈ ఎపిసోడ్‌ ‌రసవత్తరంగా మారింది. ఈ విషయంలో బిజెపి నేత, మెదక్‌  ఎం‌పి రఘునంథన్‌రావు కూడా హైకోర్టు చీఫ్‌ ‌జస్టీస్‌కు ఒక లేఖ వ్రాశారు. కెసిఆర్‌ ‌కుటుంబంపై  వస్తున్న లక్ష కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు, సిఎం రేవంత్‌రెడ్డిపై 50వేల కోట్ల సంపాదనకు సంబందించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ఆందులో కోరారు. వీరి పరస్పర ఆరోపణల్లో వాస్తవమేంటన్నది ప్రజలకు తెలియాల్సిఉందని అందుకు దీన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించా లన్నారు. కాగా దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానానికి కూడా వెళ్ళనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇదిలాఉంటే బిఆర్‌ఎస్‌ ‌సోషల్‌ ‌మీడియా కన్వీనర్‌ ‌మన్నె క్రిశాంక్‌ ఇటీవల సిఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైన తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  సిఎం, ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి దాదాపుగా 50వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని క్రిశాంక్‌ ఆరోపించారు. అయితే ఆయన తన ఆరోపణలకు సంబందించిన ఆధారాలనుకూడా మీడియా ముందు ప్రవేశ పెట్టారు. దాన్ని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని క్రిశాంక్‌ను అరెస్టు చేయడం, కోర్టు ఆయనకు బెయిల్‌ ‌మంజూరు చేయడం వేరే విషయమైనప్పటికీ ఆ ఆరోపణలతో కాంగ్రెస్‌ ‌పార్టీ పెద్ద చిక్కుల్లో పడిందనే చెప్పాలి. వాస్తవానికి  కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సిఎం రేవంత్‌రెడ్డి కెసిఆర్‌పై అనేక రకాలుగా అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలియందికాదు. అందులో ప్రధానమైనది కాళేశ్వరం కాగా, రెండవ అతిపెద్ద ఆరోపణ కెసిఆర్‌ ‌ఫామ్‌హౌస్‌పైన. ఆయన వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ ఏర్పాటు చేసుకున్నారని ఇంతకాలంగా ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డి  ఇప్పుడు కేవలం 45 ఎకరాల ప్రభుత్వభూమి మాత్రమే ఫామ్‌హౌస్‌లో కలిసి ఉంటుందని అనుమానిస్తున్నట్లు కనిపిస్తున్నది. దీంతో  ఆ 45 ఎకరాల భూమికూడా ఎక్కడుందో  తేల్చాల్సిందగా ఆయన అధికారులను పురమాయించారు. ఒకవేళ కెసిఆర్‌ ‌ఫామ్‌హౌస్‌లో ఆ భూమి ఉన్నట్లు తేలితే దాన్ని అమర వీరుల కుటుంబాలకు కేటాయించి, వారికి అక్కడ ఇండ్లు కట్టిస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారుకూడా. నిజంగానే కెసిఆర్‌ ఆ 45 ఎకరాలను కబ్జా చేశారా లేదా అన్నదిప్పుడు ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తున్నది. కాగా రేవంత్‌రెడ్డి కెటిఆర్‌, ‌హరీష్‌రావులపైనకూడా  అవినీతి ఆరోపణలు పుష్కలంగా చేశారు. అయితే వీరిద్దరుకూడా తమ ఆస్తులపై విచారణ జరిపించుకోవచ్చని, అందుకు తాము వారిని ఆహ్వానిస్తామని ప్రకటించడంతోపాటు, రేవంత్‌రెడ్డి అక్రమాలను ఎత్తి చూపుతున్నారు. రేవంత్‌రెడ్డి సోదరులు అర్హత లేకున్నా పెద్దపెద్ద కంపెనీలను తమ పేరున రిజిస్ట్రేషన్‌ ‌చేయించారని, కోట్లాది రూపాయల విలువచేసే భూములను ప్రభుత్వం వారికి కట్టబెట్టిందంటూ ప్రతివిమర్షలు చేస్తున్నారు. తొమ్మిదవ తరగతికూడా చదవని రేవంత్‌రెడ్డి తమ్ముడు ఏరోస్పేస్‌ ఇం‌జనీరు ఎలా అయ్యాడని కెటిఆర్‌ ‌ప్రశ్నిస్తున్నారు.  ఉన్న విషయాన్ని తాను దాచిపెట్టినట్లు , ఇప్పుడు రేవంత్‌ ‌చెప్పడాన్ని ఆయన ప్రతిఘటిస్తూ ఈ విషయాలను ఎన్నికల అఫిడవిట్‌లోనే చెప్పినట్లుగా కెటిఆర్‌ ‌తేల్చేశారు. పరిపాలనను గాలికి వదిలి ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంపట్ల ప్రజలు ఆవేదన పడుతున్నారు. ఈ నాయకుల తీరు చూస్తుంటే ప్రజల ప్రయోజనాలకన్నా తమ స్వార్థ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నది స్పష్టమవుతున్నదంటున్నారు. ఒకపక్క రైతులు, విద్యార్థులు,నిరుద్యోగులు, చివరకు ఉద్యోగస్థులు కూడా రోడ్లెక్కుతున్న తరుణంలో రాజకీయ నాయకులు మాత్రం భూములు, ఆస్తుల పంపకాల చుట్టూరా తిరుగుతున్నారని, ఇప్పటికైనా నాయకుల అక్రమాలపై సమగ్ర విచారణ జరపడంతోపాటు, భవిష్యత్‌లో నాయకులెవరూ ప్రజాసొమ్మును అక్రమంగా ఆర్జించకుండా చట్టపరమైన చర్చలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *