విలువల విధ్వంసపై విద్యార్థులు ఆలోచించాలి 

-ప్రొఫెసర్ హరగోపాల్ 
కాళోజీ జంక్షన్/ హన్మకొండ, ప్రజాతంత్ర అక్టోబర్ 8 : మానవ సంబంధాలు ఎలా విధ్వంసమవుతున్నాయో విద్యార్థులు ఆలోచించాలని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త  ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం సెనెట్ హాల్‌లో గురువారం వైస్‌ఛాన్సలర్ ఆచార్య కే.ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన  డాక్టర్ కే.బాలగోపాల్ 16వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో బాలగోపాల్ చిత్ర పటానికి పులమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం బాలగోపాల్ రచనల ప్రాసంగికతపై ప్రధాన వక్తగా ప్రసంగించారు.  విలువలు తరతరాలకు అందాల్సి ఉండగా ప్రస్తుత సమాజంలో అవి క్రమంగా క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ అభివృద్ధిలో విలువలు కీలకమని, అవి నాగరికతలో అంతర్భాగమని పేర్కొన్నారు. విలువలను వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు.   ఆయన ప్రతిపాదించిన సమానత్వ భావనను సమాజంలో వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. స్త్రీ, పురుషులు సమానమేనన్న భావనను బాలగోపాల్ బలంగా విశ్వసించారని తెలిపారు. విలువలు, మానవ సంబంధాలు, సామాజిక న్యాయం వంటి అంశాలు ప్రశ్నార్థకంగా మారుతున్న కాలంలో బాలగోపాల్ రచనలు సమాజానికి దిక్సూచి వంటివని  హరగోపాల్ అన్నారు. సిద్ధాంతం, ఆచరణ రెండింటి మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు బాలగోపాల్ విలువలను కేవలం చదవడానికే పరిమితం కాకుండా ఆచరణలో పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాజానికి తాను ఏమి చేయగలననే ఆలోచన ప్రతి విద్యార్థిలో ఉండాలని సూచించారు.  రాజ్యం కూడా తన బాధ్యతలకు అనుగుణంగా ప్రమాణాలను పాటించాలని బాలగోపాల్ నిరంతరం కోరుకున్నారని తెలిపారు. సమాజంలో చైతన్యం పెరగాలని, పాత భావజాలాలను అధిగమించి సమకాలీన ఆలోచనలను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు.  “బాలగోపాల్ రచనల ప్రాసంగికత” పై ఆయన ప్రధాన వక్తగా డాక్టర్  రోహిత్ ప్రసంగించారు.  సంక్షేమాన్ని కేవలం ప్రభుత్వ వ్యయంగా చూడకుండా, అభివృద్ధి దృక్పథంతో చూడాలని బాలగోపాల్ స్పష్టం చేశారని అన్నారు. సంక్షేమం భిక్ష కాదని, అది ప్రతి పౌరుడి హక్కు అని బాలగోపాల్ తన రచనల లో  చెప్పేవారని పేర్కొన్నారు.  సమాజంలో నెలకొన్న మానవ హక్కుల ఉల్లంఘనలు, అసమానతలు, అణచివేతలను గుర్తించి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. నేటి తరం బాలగోపాల్ ఆలోచనలు, రచనలను మరింతగా తెలుసుకోవాల్సిన అవసరం ఉదని తెలిపారు.  బాలగోపాల్ రచించిన పుస్తకాలు ఇప్పటికీ జనాదరణ పొందుతున్నాయని, నేటి విద్యార్థి లోకం ఆయన రచనలను చదివి వాటిలోని సామాజిక దృక్పథాన్ని అర్థం చేసుకోవాలని రోహిత్ సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల సందర్భంలో నిర్వాసితుల సమస్యలను, వారి జీవన పరిస్థితులను బాలగోపాల్ లోతుగా అర్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి ప్రక్రియలో ప్రజల హక్కులు, జీవనోపాధి, గౌరవం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని బాలగోపాల్ తన రచనలు, ఆచరణ ద్వారా చాటి చెప్పారని తెలిపారు. న్యాక్ మాజీ సంచాలకుడు ఆచార్య వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శప్రాయుడు బాలగోపాల్ అని అన్నారు. అయన స్మృత్యర్ధం పర్స్పెక్టివ్స్ అనే సంస్థను ప్రారంభించి అయన బావజల వ్యాప్తి చేస్తున్నట్టు, అయన రచనలు. ప్రసంగాలు పుస్తక రూపంలో తీసుకోస్తున్నట్టు తెలిపారు.  ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య కే.ప్రతాప్ రెడ్డి తన అధ్యక్ష ప్రసంగంలో బాలగోపాల్ నేటి తరానికి ఆదర్శప్రాయుడు అని, అయన పేరున విశ్వవిద్యాలయంలో నిర్వహించే స్మారక ఉపన్యాసాలు విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం మాట్లాడుతూ బాలగోపాల్ విశ్వవిద్యాలయ పూర్వపు ఆచార్యులు అయినందుకు విశ్వవిద్యాలయ గర్విస్తుంది అన్నారు, గణిత శాస్త్ర వేత్తగానేకాక బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. ఈ సందర్భంగా నిత్య జీవితంలో మానవ హక్కులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు, బాలగోపాల్ సతీమణి వసంత లక్ష్మి, పలువురు అతిధులు పాల్గొన్నారు. ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల‌ సంయోజకులుగా వ్యవహరించారు.
—————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *