రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలకు అవకాశం

హెచ్చరించిన హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ
పలు జిల్లాలకు ఎల్లో  ఆరేంజ్‌ అలర్ట్ ‌జారీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని, ఒడిశా పూరీకి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కిలోవి•టర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వాయుగుండం వాయువ్య దిశగా పయనించి..ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా వి•దుగా వెళ్తూ అదే తీవ్రతను కొనసాగిస్తూ సోమవారం అర్ధరాత్రి వరకు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని చెప్పింది.
24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌ ‌వి•దుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో కుమ్రమ్‌ ‌భీమ్‌ ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌జగిత్యాల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది.

రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మ, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌జయశంకర్‌, ‌భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌ ‌జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వివరించింది.

సామాజిక న్యాయానికి పెద్ద పీట
కులగణన కాంగ్రెస్‌ ‌తోటే సాధ్యం..రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం
జాతీయ స్థాయిలో కులగణనకు ఏఐసిసి అధినేత ఖర్గే, సోనియా గాంధీల గ్రీన్‌ ‌సిగ్నల్‌
‌బిసి కమిషన్‌ ‌పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి
 
 
image.png
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జెప్టెంబర్‌ 9 : ‌సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ ‌పార్టీ పెద్ద పీట వేస్తుందని, కులగణన కాంగ్రెస్‌ ‌పార్టీతో మాత్రమే సాధ్యపడుతుందని  రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే కులగణనకు భావి ప్రధాని రాహుల్‌ ‌గాంధీ దిశానిర్దేశం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఉత్తమ్‌ ‌గుర్తు చేశారు. సోమవారం ఖైరతాబాద్‌లో రాష్ట్ర బిసి కమిషన్‌ ‌పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ ‌పార్టీ పట్ల అంకిత భావంతో పని చేస్తున్న నిరంజన్‌తో బిసి కమిషన్‌ ‌చైర్మన్‌ ‌హోదాకు హుందాతనం వొస్తుందని ఆయన ప్రశంసించారు.
త్యాగం,నిజాయతీ నిబద్ధతలతోనే నిరంజన్‌కు ఉన్నత స్థానం దక్కిందన్నారు. అటువంటి కమిషన్‌కు చైర్మన్‌గా నియమితులైన నిరంజన్‌ ఆధ్వర్యంలో జరగబోయే కులగణనకు తనతో సహా రాష్ట్ర మంత్రివర్గం, ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు తప్పకుండా సహాకరిస్తారన్నారు. ఇక జాతీయ స్థాయిలో కులగణనకు కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేలు ఆమోదించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ చట్టసభలతో పాటు ప్రతి వేదిక మీద కులగణన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్‌ ‌హయంలోనే ఓబిసిలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. పదవులతో పాటు పధకాలలోనూ ఓబిసిలకు పెద్ద పీట వేసేది కాంగ్రెస్‌ ‌పార్టీ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎప్పటికీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని, రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పిసిసి అధ్యక్ష పదవిని బిసి లకు కేటాయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. భవిష్యత్‌లోనూ బిసిలకు కాంగ్రెస్‌ ‌పార్టీ వెన్నుదన్నుగా నిలుదని, అందుకు బిసిలు సంఘటితమై కాంగ్రెస్‌ ‌పార్టీకీ, భవిష్యత్‌ ‌ప్రధాని రాహుల్‌ ‌గాంధీకి అండగా ఉండాలని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్‌ ‌చైర్మన్‌ ‌యం.కోదండరెడ్డి, సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత, మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *