సర్వోత్తమ్ రెడ్డి గెలుపే లక్ష్యం కావాలి

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం

కాజిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: ప‌ట్ట‌ భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డి భారీ విజ‌య‌మే అం ద‌రి ల‌క్ష్యం కావాల‌ని రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రం లోని ప్రతిష్టాత్మక సంస్థ సింగరేణిలో 18 గనులను మూసేసి, 40 వేల మంది కార్మికుల జీవితాలను రోడ్డున పడేసిన చరిత్ర గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేననివిమర్శించా రు. సింగరేణి విషయంలో ఇప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని, పదేళ్ల అధికారంలో ఒక్క గనినైనా కాపాడలేకపోయారని మండిపడ్డారు. అప్పట్లో గనుల వేలంపాటలో పాల్గొనకుండా సింగరేణికి అన్యాయం చేసిన బీఆర్‌ఎస్‌కు ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూడు గనుల వేలం పాటలో పాల్గొని సింగరేణిని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. గురువారం వరంగల్‌లో నిర్వహించిన వరం గల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి వరంగల్ జిల్లా సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు.

మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కు బలం

వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లా ల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఐతో కలిపి 32 స్థానాల్లో కాంగ్రెస్ పక్షం బలంగా ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. మి గిలిన రెండు నియోజకవర్గాల్లోనూ గతంలో కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ శ్రేణునులు సమన్వయంతో పనిచేసి, పట్టభద్రుల వోటర్లను కలిసి మొదటి ప్రాధా న్యత వోటు సర్వోత్తమ్‌ రెడ్డికి వేసేలా చూడా లన్నారు. వొచ్చే నెల 6 వరకు వోటు నమోదు, రెన్యువల్‌కు అవకాశం ఉన్నందున దసరా సహా పండుగలకు స్వగ్రామాలకు వొచ్చే పట్టభద్రులు తమ వోటు హక్కును నమోదు చేసుకునేలా చూడాలన్నారు.

సంక్షేమ ప‌థ‌కాల గురించి వివ‌రించండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయా నికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే సుమారు 47 వేల పట్టభ ద్రుల వోట్లు ఉన్నాయని, అర్హుల వోటు నమోదు, రెన్యువల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఎన్నికలకు చాలా రోజులు ముందు గానే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడం పార్టీ ఎన్నికల సన్నద్ధతకు నిదర్శనమని పేర్కొ న్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని పొంగులేటి అన్నా రు. వోటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాం ధీ నాయకత్వంలో జరుగుతున్న పోరాటానికి ల‌క్ష‌లాది మంది పార్టీ శ్రేణులు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్న లక్ష్య సాధన దిశగా కాంగ్రెస్ శ్రేణులు ముం దుకు సాగాలన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ పరస్పర అవగాహనతో పనిచేస్తున్నాయని అన్నారు. సర్వో త్తమ్‌ రెడ్డి విజయమే లక్ష్యం గా పనిచేయాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *