– సిరిసిల్లలో 20 వేలకు పడిపోయిన మరమగ్గాలు..
– స్థానిక యువత దూరమై వలస కార్మికులపై ఆధారపడుతున్న వస్త్ర రంగం
– ప్రచారానికే పరిమితమైన బతుకమ్మ చీరల ఆర్డర్లు, ఓటీఎస్ పథకాలు
– తీవ్ర నిరాశలో పారిశ్రామికులు, కార్మికులు
– నేతన్నల సమస్యలు తీరేదెన్నడు?
దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పి స్తున్న రంగాల్లో చేనేత, మరమగ్గాల పరిశ్రమలు అత్యంత కీలకమైనవి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వస్త్ర పరిశ్రమ నేడు అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతోంది. ప్రభుత్వాలు చేపడుతున్న పథకాల ప్రచార హోరుకు, క్షేత్రస్థాయిలో నెలకొన్న దయనీయ పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గతాన్ని, వర్తమానాన్ని విశ్లేషిస్తూ ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక పరిశీలనాత్మక కథనం.
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సిరిసిల్లరాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల పరిశ్రమలకు సిరిసిల్ల కేంద్రంగా ఉంది. సిరిసిల్లలో అనేక పరిణామాలు, ప్రతి కూల పరిస్థితుల మధ్య వస్త్ర పరిశ్రమ ఎదుగుతూ వచ్చిన పేరు ప్రత్యేకంగా అనిపిస్తుంది. మొదట చేనేత పరిశ్రమకు కేంద్రంగా ఉన్న సిరిసిల్లలో 1980 వరకు ఒక వెలుగు: వెలిగిన చేతిమగ్గాలు, అనంతరం చోటుచేసుకున్న సామా జిక మార్పుల కారణంగా క్రమంగా ఉనికిని కోల్పోయా. యి. ఆ స్థానంలో మరమగ్గాల పరిశ్రమ విస్తరిస్తూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కొత్త రూపాన్ని సంతరించుకుంది. కాటన్ ఉత్పత్తులతో ప్రారంభమైన మరమగ్గాల పరిశ్రమ, 1990 అనంతరం పాలిస్టర్ ఉత్పత్తుల దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించింది.
చేతిమగ్గం నుంచి మరమగ్గాల వైపు
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో దేశంలోని ఇతర ప్రాం తాలకు భిన్నమైన పరిణామాలను గమనించవచ్చు. దేశంలోనైనా, తెలుగు రాష్ట్రాల్లోనైనా చేనేత, మరమగ్గాల పరిశ్రమల మధ్య ఘర్షణపూరిత వాతా వరణం కనిపిస్తుంది. అయితే సిరిసిల్లలో చేతిమగ్గాల స్థానంలో మరమగ్గాల పరిశ్రమ ఆవిర్భవించడం ప్రత్యేకమనే చెప్పాలి, మొదట ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన చేనేత కుటుంబాలకు చెందినవారే మరమగ్గాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆతర్వాత కాలంలో సైజింగ్, డైయింగ్ యూనిట్లు కూడా రావడంతో కాటన్ రంగం ఒక వెలుగు వెలిగింది. ఒక్క సిరిసిల్లలోనే సుమారు 20కి పైగా సైజింగ్ యూనిట్లు, 340కి పైగా డైయింగ్ యూని ట్లు ఏర్పడి ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వచ్చాయి.
కొన్ని సామాజిక బృందాల అధ్యయనాల ప్రకారం, సుమారు 5,000 కు పైగా మరమగ్గాలపై కాటన్ ఉత్పత్తు లు. 30 వేలకు పైగా మరమగ్గాలపై పాలిస్టర్ ఉత్పత్తులు జరిగినట్లు వస్త్ర పారిశ్రామికులు చెబుతుంటారు. 1995 తర్వాత సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో చోటుచేసుకున్న పరిస్థితులు అనేక విషాదాలకు దారితీశాయి. అప్పటికీ పరిశ్రమలో మూడంచెల వ్యవస్థ విస్తరిస్తూ పోవడం గమనించవచ్చు. సంక్షోభాల ప్రభావం వస్త్ర పరిశ్రమ కార్మికుల శ్రమపైనే పడుతుండేది. ఏడాదిలో కేవలం మూడు నెలలు మాత్రమే పూర్తిస్థాయిలో పని ఉండటం అప్పట్లో కార్మికుల్లో ఆందోళనకు కారణ మైంది. ఈ పరిస్థితులు 2007 వరకూ కొనసాగాయి. అప్పటి నుంచి పథకాలకు ప్రచారాల ముసుగులు తొడగ డం ప్రారంభమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా అదే పరిస్థితి కొనసాగుతూ రావడం ఆందోళన కలిగించే పరిణామం.
ఆధునికీకరణ నుంచి కార్పొరేషన్ దాకా.. 
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభాలకు పాత విధానాలే కారణమని, ఆధునికీకరణే పరిష్కారమని పాలకులు చెబుతూ వస్తున్నారు. దశాబ్దాల తరబడి పథకాల పేరుతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై పథకాల ముసుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి రా ష్ట్రంలోనే ఆధునికీకరణలో భాగంగా ఇప్పటి తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి-బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేయడంతోపాటు మరమగ్గాలకు 50 శాతం సబ్సిడీ అందించే విధానం కొనసాగుతూ వచ్చింది. ఇవేకాక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా మరమగ్గాల ఆధునికీకరణ కొనసాగింది. అలా కొనసాగుతున్న పథకాలు ప్రచారానికే పరిమితమై పరిశ్రమలో మౌలికమైన మార్పులు తీసుకురాలేకపోవడాన్ని గమనించవచ్చు. 2017 ప్రారంభమైన తెలం గాణ చేనేత, పవర్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదన 2018లో కార్యరూపం దాల్చింది. కార్పొరేషన్ చైర్మన్ నియామకం జరగడానికి కూడా సంవత్సరాలు పట్టింది. ఆధునికీకరణ నుంచి వర్కర్ ఓనర్ పథకం వరకు చోటుచేసుకున్న పరి ణామాలను గమనిస్తే పరిశ్రమలో జరిగిన మార్పులు ఆశ్చర్యం కలిగిస్తాయి. టెక్స్టైల్ పార్కులో పారిశ్రామి కులకు అందించిన వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్), మరెన్నో సబ్సిడీలు పరిశ్రమను ఎటువైపు తీసుకెళ్లాయి. ప్రచార పథకాలుగానే చీరల ఆర్డర్లు పరిమితం అయ్యాయా అన్న ప్రశ్న వెంటాడుతోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వస్త్ర పారిశ్రామికుడు వేదనతో తెలిపాడు. ఒకవేళ అభివృద్ధి పేరుతో పరిశ్రమ దూసుకుపోతే ఎందుకు కుచించుకుపోతోందన్నది అందరిని వెంటాడుతున్న ప్రశ్న. ఇటీవల వస్త్ర పరిశ్రమలో చోటుచేసుకున్న పరిణామాలను నిస్తే తా మంటి నా పరిశ్రమను అభివృద్ధిడద్దు. పరోక్షంగా తా చెబుతున్నప్పటికీ, ఒక దశలో టెకెల్ పార్కులోని ఆధునిక మరమగ్గాలు తరలిపోగా, అక్కడి భవనాలను ధాన్యం నిల్వల కోసం గోదాములుగా ఉపయోగించిన దుస్థితిని గమనించవచ్చు. మరోవైపు వస్త్ర పరిశ్రమలో విభిన్నమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిన్న, మధ్యతరహా పారిశ్రామికులు పరిశ్రమకు దూరంగా నెట్టివేయబడటమో. స్వచ్ఛందంగా నేత వృత్తిని వదిలి ఇతర వృత్తుల్లోకి మారిపోవడమో గమనించవచ్చు. దశాబ్ద కాలంలో పెద్ద పెద్ద కర్కానాలు పుట్టుకురావడం ఒక ప్రత్యేకమైన మార్పుగా చెప్పాలి. ఎన్ని అభివృద్ధి పథకాల ముసుగులు వేసినా పరిశ్రమలో నెలకొన్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనేకమంది నేత కార్మికులు, అనుబంధ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న కార్మికులు ఇతర వృత్తుల్లోకి మారిపోయారు. ఫలితంగా పరిశ్రమ కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిణామాలపై ఓ వస్త్ర పారిశ్రామికుడు ‘ప్రజాతంత్ర’తో మాట్లాడుతూ కార్మికుల కొరత కారణంగా బీహార్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులపై ఆధార పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పకప్పుడు 30 వేలకు పైగా ఉన్న మరమగ్గాల సంఖ్య 20
వేల స్థాయికి పడిపోయిన పరిస్థితి ఉంది.సైజింగ్ యూనిట్ల సంఖ్య సింగల్ డిజిట్ డైయింగ్, యూనిట్ల సంఖ్య ఇరవై లోపుకు పడిపోవడం గమనించవచ్చు. ప్రధానంగా కొత్త తరం ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగిస్తోందనే వాదనలు వినవస్తున్నాయి. రానున్న రోజుల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.
పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలన
1997–98లోనే 270 మంది నేత కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆందోళన చెందిన కేంద్ర ప్రభుత్వం, 1998లో సురవరం సుధాకర్రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిరిసిల్లలో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పలు సిఫార్సులను ప్రభుత్వానికి అందజేసింది. ఆధునికీకరణతోపాటు నేత కార్మికుల ఉపాధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





