బీఆర్ఎస్‌ పార్టీ బలోపేతమే లక్ష్యం

మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

సైదాపూర్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 15 : ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)ని మరింత బలోపేతమే ల‌క్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. సైదాపూర్ మండల పరిధిలోని ఎలబోతారం (చింతలపల్లి) గ్రామంలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పార్టీ మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి వొడితల సతీష్ కుమార్ హాజరై మాట్లాడారు. పార్టీ శ్రేణులందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసు కొని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి, ప్రజల పక్షాన నిలబడి వాటి పరిష్కారం కోసం పోరాడాలని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగుతూ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఐకమత్యం ఎంతో ముఖ్యమని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

సైదాపూర్ మండల నూతన కమిటీ ఎన్నిక

సమావేశంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సైదాపూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. మండల పార్టీ అధ్యక్షుడిగా చల్మెడ రాజేశ్వర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిగా పైడిపల్లి రవీందర్ గౌడ్ ఎన్నిక‌య్యారు. నూతన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో పార్టీని మండలంలోని ప్రతి గ్రామంలో మరింత బలోపేతం చేస్తూ, పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు ఆకాంక్షించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *