ఖనిజ సంపదను దోచుకోవడానికే మారణ కాండ

నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు లేదు..
శాంతి చర్చలతోనే దేశానికిసమాజానికి మేలు
రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు

హైదరాబాద్ప్రజాతంత్రఏప్రిల్ 4 : ఖనిజ సంపదను దోచుకోవడానికే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మారణకాండ కొనసాగిస్తున్నాయని పలువురు వక్తలు మండిపడ్డారు. హత్యలు నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు రాజ్యానికి లేదన్నారు. ప్రభుత్వానికిమావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగితే పౌర సమాజానికిదేశానికి మేలు జరుగుతుందన్నారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పీస్ డైలాగ్ కమిటీ (శాంతి చర్చల కమిటీ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికిమావోయిస్టు పార్టీ మధ్య చర్చలు‘ అనే అంశంపై జస్టిస్ బి.చంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్సాధినేని వెంకటేశ్వరరావుజీవన్గాదె ఇన్నయ్యచంద్రశేఖర్ప్రొఫెనర్ తిరుమల్బాలకిషన్ రావుతిరుపతిప్రొఫెసర్ వినాయక రెడ్డిప్రొఫెనర్ అన్వర్ ఖాన్ తదితరులు ప్రసంగించారు.

ఈ సందర్బంగా ప్రొఫెనర్ జి.హరగోపాల్ మాట్లాడుతూ నాడు రాజ్యం అమాయక పౌరులను కాల్చి చంపి బూటకపు ఎన్ కౌంటర్లుగా చిత్రికరించిందని ఆరోపించారు. నేడు ఛత్తీస్ గఢ్  రాష్ట్రంలోని ఆదివాసీల ఆధీనంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి అమాయకులైన ఆదివాసీలను మావోయిస్టు పేరుతో రాజ్యం హత్యలు చేస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఖనిజ సంపదను దోచి పెట్టడం కోసమే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 2026 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని బహిరంగంగా పార్లమెంట్ వేదికగా ప్రకటన చేయడం దారుణమన్నారు.

ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రికేంద్ర హోం శాఖ మంత్రి కలయిక చర్చలకు అమోదిస్తారా అన్న విషయం అనుమానంగా ఉందన్నారు. చర్చలు ప్రభుత్వం చేస్తుందోలేదో తెలియదు కాని పౌర సమాజంమేధావులుకవులు సమాజంలోకి లోతుగా తీసుకువెళ్ళినప్పుడే శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. అల్లం నారాయణ మాట్లాడుతూ ఛత్తీన గఢ్ లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర నిర్బంధం నేపథ్యంలో చర్చల ప్రతిపాదన వొస్తున్నదని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య వాతావరణ వొస్తుందనే ఒక ప్రయత్నం జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page