ఎన్యూమ‌రేష‌న్ ద‌శ ముగిసింది

– పార్టీల ప్ర‌తినిధుల‌కు వెల్ల‌డించిన సీఈఓ
-సెప్టెంబ‌ర్ 16 వ‌ర‌కు అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌
– ప్ర‌తినిధుల‌కు ఓట‌ర్ల జాబితా అంద‌జేత‌
– రాజ‌కీయ పార్టీలు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 17 : జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన ఎన్యూమరేషన్ దశ విజయవంతంగా పూర్తయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి వివ‌రించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమ‌వారం సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఎలక్టర్ల నుంచి సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాలు  2.65 కోట్లు అంటే మొత్తం ఎలక్టర్లలో 78.30 శాతం ఉన్నట్లు తెలిపారు. అలాగే మరణించిన ఎలక్టర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, అందుబాటులో లేని/గైర్హాజరైన ఎలక్టర్లు, ఇతర కేటగిరీలకు చెందిన వారు, అలాగే ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల్లో నమోదైన ఎలక్టర్లకు సంబంధించిన వివరాలను సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, అలాగే 17 ఆగస్టు 2026 నుంచి 16 సెప్టెంబర్ 2026 వరకు నిర్వహించనున్న క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ దశ కోసం చేపట్టిన ఏర్పాట్లను కూడా సీఈఓ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.   ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను  పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేసి, పలు పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలకు  సమాధానాలు ఇచ్చారు. వారి నుంచి వచ్చిన సలహాలను స్వీకరించి పరిశీలిస్తామన్నారు. అనంతరం గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్) హార్డ్ డిస్క్ ద్వారా అందజేశారు. జాబితా పరిశీలనలో క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ప్రక్రియలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు చురుకుగా పాల్గొనాలని సీఈఓ కోరారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలని, తద్వారా ఓటర్ల జాబితా ఖచ్చితమైనదిగా, సమగ్రంగా, పారదర్శకంగా, లోప రహితంగా ఉంటుందని, దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వి.వెంకటేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ  అదనపు కార్యదర్శి, ఎంఎన్ఓ ఎన్.శంకర్, జి.ఎస్.చారి, నోడల్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *