సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం

ఐటీపరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

జయశంకర్ భూపాలపల్లిప్రజాతంత్రఏప్రిల్ 4 : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం  చారిత్రాత్మకమైనదని రాష్ట్ర ఐటీపరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్ లో ప్రజలకు సన్నబియ్యం అందించి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని చొరవ తీసుకుని దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. గొప్ప మానవీయ పథకాన్ని ప్రారంభించి మంత్రులుకార్పొ రేషన్ చైర్మన్లుజిల్లా కలెక్టర్లు తినే సన్నబియ్యం నిరుపేదలకు అందిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికిపౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.  రాష్ట్రం అంతటా  ఏప్రిల్ నుండి పిడిఎస్ లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమయ్యిందని తెలిపారు గతంలో వినియోగదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో అది దారిమళ్లిందనిఫలితంగా కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైందని తెలిపారు.

ప్రజలు ఎక్కువగా సన్నబియ్యం ఇష్టపడుతారనివినియోగం కూడా ఎక్కువగా ఉంటుందని,  కాబట్టి సన్నబియ్యం వినియోగాన్ని పెంచడానికిదొడ్డు బియ్యం రీసైక్లింగ్ ను అరికట్టడానికి చౌక దుకాణాల ద్వారా  సన్న బియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపారు. 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం దాదాపు రూ.2858 కోట్లు అవుతుందని తెలిపారు. ప్రభుత్వంలో  రేషన్ డీలర్లు భాగస్వాములనిప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సక్రమంగా పంపిణీ చేయాలనిమీ సమస్యలను సానుకూలంగా  పరిష్కరిస్తామని,  లబ్ధిదారులకు క్రమం తప్పకుండా సన్న బియ్యం ఇవ్వాలని సూచించారు. నిరుపేదలకు సన్నబియ్యం ఇచ్చేందుకు  సన్నరకం ధాన్యానికి వేల కోట్ల బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలిచామని తెలిపారు.  ప్రతి వ్యక్తికి కిలోలు చొప్పున పంపిణీ చేస్తున్నామని నలుగురున్న కుటుంబానికి నెలకు దాదాపు 1400 రూపాయలు ఆదా అవుతుందని తెలిపారు.

 మంథని నియోజకవర్గంలో 41,045 మంది కార్డుదారులున్నారని ఈ పథకం అమలుతో 1,17,069 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు.  రానున్న 15 రోజుల్లో లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.. ఎలాంటి పైరవీలకు తావులేకుండా నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని  అన్నారు.  రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఈ పధకానికి దరఖాస్తు చేయడానికి ఈ నెల 14 చివరి తేదీ అని తెలిపారు.  గత ప్రభుత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని అయినప్పటికి ఇచ్చిన మాట ప్రకారం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.  రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐయిత ప్రకాష్ రెడ్డిజిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్విజయలక్ష్మికాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్పౌర సరఫరాల డిఎం రాములుమండల ప్రత్యేక అధికారిడిఆర్డీఓ నరేష్పరిశ్రమల శాఖ జిఎం సిద్దార్థ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *