– ఎల్నినో వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : ఎల్నినో ప్రభావంతో కరువు మేఘాలు కమ్ముకొస్తున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జాబ్ కార్డులు లేని గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యా దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీబీ జీ రాంజీ పథకం కింద అర్హులైన ఆదివాసీ గిరిజన కుటుంబాలకు 125 రోజుల ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన కుటుంబ సభ్యులందరి పేర్లను జాబ్ కార్డుల్లో నమోదు చేయాలన్నారు. కరువు పరిస్థితుల్లో ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించి వలసలను నివారించడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో జాబ్ కార్డుల జారీ, 125 రోజుల ఉపాధి కల్పనపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు దివ్య దేవరాజన్ ఆదేశాలు జారీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




