జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తాం

– న్యాయపరమైన చిక్కులు లేకుండా స్థలాలు ఇస్తాం 
– కార్యాచరణ రూపొందిస్తున్నాం
– రెవెన్యూ, హౌసింగ్శా ఖల మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. చట్టపరమైన చిక్కులు లేని విధంగా, నివాసయోగ్యమైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఏపీలో 2008లో జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని, అయితే దీనిపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే ప్రక్రియ సుదీర్ఘకాలం నిలిచిపోయిందని తెలిపారు. 2022లో న్యాయపరమైన అడ్డంకులు తొలగిన తర్వాత కూడా గతంలో ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై చొరవ తీసుకున్నదన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి 2024 సెప్టెంబర్ 8న రవీంద్ర భారతిలో కార్యక్రమాన్ని నిర్వహించి భూమిని సొసైటీకి అప్పగించామని గుర్తు చేశారు. అనంతరం సుప్రీంకోర్టు తుది ఉత్తర్వుల నేపథ్యంలో మరోసారి న్యాయపరమైన సమస్యలు ఎదురుకావడంతో ఈ అంశానికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు సహచర మంత్రులతో పలుమార్లు చర్చించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే అంశంపై సమగ్రంగా సమీక్షించినట్లు వెల్లడించారు. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది అని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జర్నలిస్టులకు ఇÞ ø్లస్ధలాలు ఇవ్వడం జరిగిందని, మరోసారి కాంగ్రెస్ పాలనలోనే ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంతోపాటు, వారికి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *