బ‌న‌క‌చ‌ర్ల‌ను అడ్డుకొని తీరుతాం

  • కృష్ణా, గోదావ‌రి జ‌లాల వాటాల‌పై రాజీ ప్ర‌స‌క్తే లేదు
  • క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మైనా మేం లెక్క‌చేయం
  • నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి

హ‌నుమ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11: బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) ను అడ్డుకుని తీరుతామ‌ని నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ స్ప‌ష్టం చేశారు. హ‌నుమ‌కొండ‌లో ఆయ‌న విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో నూ నిర్మాణానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం బనకచర్లను అడ్డుకుంటున్నామ‌న్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ .పాటిల్ కు స్వయంగా కలవడంతో పాటు లిఖితపూర్వ కంగా తెలంగాణా అభ్యంతరాలను తెలియ ప‌ర‌చామ‌ని గుర్తుచేశారు. ఆల్మట్టి ఎత్తును సమర్ధించే ప్రసక్తే లేదన్నారు. అక్కడ కాం గ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఉపేక్షించేది లేదన్నా రు. హరీష్ రావు మాటల్లో ఒక్కటీ నిజం లేదన్నారు. కృష్ణా,గోదావరి జలాశయాల లో తెలంగాణాకు నష్టం జరిగింది అంటే అది బి.ఆర్.ఎస్ పాలనలోనే నాటి ముఖ్య మంత్రి కేసీఆర్, నీతిమంత్రి హరీష్ రావులు కృష్ణా జలాశయాలలో ఆంద్రప్రదేశ్ కు 512 టి.యం.సి నీటి వినియోగానికి ఒ ప్పందం కుదుర్చుకున్నారు. ఆంద్రప్రదేశ్ కు 512 టి.యం.సి లు తెలంగాణా కు 299 టి.యం.సి ల నీటి కేటాయింపులు అంటూ లిఖిత పూర్వకంగా ఒప్పుకుంది బి.ఆర్.ఎస్ ప్రభుత్వమే. కృష్ణా, గోదావరి జలాశయాలలో తెలంగాణాకు నష్టం జరి గింది అంటే అది పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలోనేన‌న్నారు.

కృష్ణా జలాశయాలలో తెలం గాణాకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా పై ట్రిబ్యునల్ ఎదుట సమర్ధవంతంగా వాద నలు వినిపించామ‌న్నారు. స్వయంగా నీటిపారుదల శాఖామంత్రి హోదాలో తాను ట్రిబ్యునల్ ఎదుట హాజరయ్యానని గుర్తుచేశారు. కృష్ణా జలాశయాలలో 70% తెలంగాణా వాటా సాదించేందుకు గట్టి పట్టు పడుతున్నామ‌న్నారు. ఇన్ని వాస్తవాలను వక్రీకరించి రాజకీయ దురుద్ధేశంతో హరీష్ రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారినా 148.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి భారతదేశ చరిత్రలోనే రికార్డు సృష్టించింద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు అయిన మూడు పంటలు దిగుబడిలో అధిక ఉత్పత్తి సాధించిన తీరు ప్రభుత్వ పనితీరును ప్రతిబింబిస్తుంద‌న్నారు.

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంద‌న్నారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయాల‌న్న‌దే ప్రభుత్వ సంకల్పమ‌న్నారు. తమ్మిడిహట్టి వద్ద చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు కట్టి తీరుతామ‌న్నారు. సమ్మక్క-సారక్క ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు సాధిస్తున్నామ‌న్నారు. సీతారామ ప్రాజెక్టు కు 65 టి.యం.సి ల నీటి కేటాయింపులు సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదేన‌న్నారు. హరీష్ రావు అనుచిత వ్యాఖ్యాలు మాను కోవాల‌ని హిత‌వు ప‌లికారు. అసత్యప్రచారంతో గందరగోళం సృష్టించ వద్దని కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page